మోడీ సొంత సీటున కాంగ్రెస్ దున్నేసింది!


ఎట్ట‌కేల‌కు మోడీ విజ‌యాల‌కు బ్రేక్ ప‌డింది. కాంగ్రెస్ విజ‌యం కూడా మొద‌లైంది. పంజాబ్‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో బీజేపీని మ‌ట్టిక‌రిపించి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. బీజేపీ సిట్టింగ్ సీటును లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ ఎంపీ వినోద్‌ఖ‌న్నా మృతితో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్లో ఈ నెల 11న ఉప ఎన్నిక జ‌రిగింది. ఈ ఎన్నిక‌ల‌లో బీజేపీని ఓడించి ఆ పార్టీ సిట్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఇక్క‌డి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జాఖర్‌.. బీజేపీ-అకాలీదళ్‌ అభ్యర్థి స్వరణ్‌ సలారియాపై 1,93,219 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్క‌డ బ‌రిలోకి దిగిన అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థికి కేవ‌లం 23 వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అభ్య‌ర్థి జాఖ‌ర్ మాట్లాడుతూ బీజేపీ ప‌ని ముగిసిన‌ట్లేన‌ని పంజాబ్‌లోని బీజేపీ మిత్ర‌ప‌క్షం అకాళీద‌ల్ త్వ‌ర‌లో విచ్చిన్నం అవుతుంద‌ని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ చేప‌డుతున్న అభివృద్ధికి ప్ర‌జామోదం ల‌భించింద‌ని ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌ అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ కార్యక్రమాలు, పథకాలపై పునర్విశ్వాసాన్ని వ్యక్తంచేశారని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జెవాలా అన్నారు.
మ‌రోవైపు కేర‌ళ‌లో ఉనికి చాటుకోవాల‌ని బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కూడా గండి ప‌డింది. ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆ పార్టీ నాలుగో స్థానంలోనిలిచింది. కేరళలోని వెంగర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ భాగస్వామి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) అభ్యర్థి కేఎన్‌ఏ ఖాదిర్‌ 23,310 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్క‌డ అధికారంలో ఉన్న సీపీఎంకు 42 వేల ఓట్లు రాగా… బీజేపీకి కేవ‌లం ఐదు వేల ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ స్థానం నుంచి గెలిచిన ఐయూఎంఎల్ నేత పార్ల‌మెంట్‌కు ఎన్నిక కావ‌డంతో ఇక్క‌డ ఎన్నిక అనివార్యం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *