క్రికెట్ కోచ్ రేసులో కొత్త పేరు

భార‌త్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వి అంటే చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. విదేశీ ఆట‌గాళ్లు కూడా ఈ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతుంటారు. ఈ ప‌ద‌వి నుంచి అనిల్‌కుంబ్లే వైదొలిగారు. దాంతో ఆ ప‌ద‌వి కోసం అనేక మంది ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. బీసీసీఐ రెండోసారి కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించిన త‌ర్వాత బీసీసీఐ మాజీ డైరెక్ట‌ర్ ర‌విశాస్ర్తి రేసులోకి వ‌చ్చారు. ఇప్పుడు మాజీ పాస్ట్ బౌల‌ర్ వెంక‌టేశ్‌ప్ర‌సాద్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వెంక‌టేష్ ప్ర‌సాద్ భార‌త‌క్రికెట్ జ‌ట్టులోకి 1996లో వ‌చ్చారు. 33 టెస్టులు, 162 వ‌న్డేలు ఆడారు. రెండున్న‌రేళ్లుగా జూనియ‌ర్ క్రికెట్ టీమ్‌కు సేవ‌లు అందిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌తో ఆయ‌న ప‌ద‌వికాలం ముగియ‌నుంది. ఇప్పుడు భార‌త క్రికెట్‌జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించేందుకు ఆస‌క్తిగా ఉన్నాడు. తొలుత టామ్‌మూడీ, సెహ్వాగ్‌, రిచ‌ర్డ్ పైబ‌స్ ద‌ర‌ఖాస్తు చేసి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *