చంద్ర‌బాబు తోడ‌ల్లుడి అడుగులు వైసీపీ వైపు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. అప్పుడే సాధార‌ణ ఎన్నిక‌ల ఫీవ‌ర్ మొద‌లైంది. సీట్లు , నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప‌ట్టుకోసం నాయ‌కులు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. త‌మ‌కు ప‌దిల‌మైన పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక మంది నాయ‌కులు పార్టీలు మారుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా చంద్ర‌బాబునాయుడు తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రి దంప‌తులకు సంబంధించిన వార్త ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. వాళ్లిద్ద‌రూ ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.
వాళ్లిద్ద‌రూ వైసీపీతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు రాజ‌కీయాల‌కు కొత్త‌కాదు. ఒక‌ప్పుడు ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీల్లో ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఆయ‌న స‌తీమ‌ణి , ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురందేశ్వ‌రి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో ఆమె కేంద్ర‌మంత్రిగా ప‌ని చేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరింది. ఇప్పుడు ఆ పార్టీలో కొన‌సాగుతున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రి వైసీపీలో చేరితే ఎలా ఉంటుంద‌న్న దానిపై చ‌ర్చించిన‌ట్లుతెలుస్తోంది. వాళ్ల‌కుమారుడు చెంచురామ్ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని వైసీపీలో చేరేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పురందేశ్వ‌రికి ఆమె కోరుకున్న నియోజ‌క‌వ‌ర్గాన్నికేటాయించ‌డంతోపాటు వెంక‌టేశ్వ‌ర‌రావు, చెంచురామ్‌ల‌లో ఒక‌రికి ప‌ర్చూరు సీటు ఇస్తామ‌న్న హామీ వైసీపీ నుంచి కూడా వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *