కాంగ్రెస్ కి దామోదర షాక్… బీజేపీలోకి ఆయన…!?

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా పని చేసిన నేత దామోదర రాజనరసింహ. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ని మళ్ళీ అధికారంలోకి తేవడంలో కీలకమైన పదవిలో వున్నారు. మేనిఫెస్టో రూపకల్పనే ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల్లో సగం విజయం సాధించి పెడుతుంది. మిగిలిన సగం విజయం ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పూర్తవుతుంది. అలాంటి కీలకమైన పదవిలో దామోదరను కాంగ్రెస్ ఆ కీలక పదవిలో కూర్చోబెట్టింది.

అయితే ఇప్పుడు ఆ నేత కుటుంబం నుంచి కాంగ్రే కి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. కాంగ్రెస్‌ నేత రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పద్మినీరెడ్డి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *