తెలుగు సినీ పరిశ్రమకు డెడ్ లైన్… హోదా ఉద్యమకారుల హెచ్చరిక

తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక హోదా సాధన సమితి డెడ్ లైన్ విధించింది. రాష్ట్ర భవిష్యత్తు కొలం జరుగుతున్న పోరాటంలో కలిసి రాకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సమితి వెల్లడించింది. తెలుగు సినీ పరిశ్రమకు త్వరలో అల్టిమేటం ఇవ్వనున్నట్లు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఆయన చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ సినిమా వాళ్ళు హోదా ఉద్యమంలో పాల్గొనకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాకు తెలంగాణ నాయకులు మద్దతు తెలుపుతున్నా.. సినీ పరిశ్రమ నిమ్మకు నీరెత్తినట్టుందని ఆయన విమర్శించారు.

హోదా ఉద్యమంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్‌బాబు పాల్గొనలేదని, కానీ తెలంగాణకు చెందిన నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారని ఆయన అన్నారు. చిత్తూరు నుండి బెంగళూరు పాదయాత్రకు ఎన్నికల కోడ్ వల్ల అనుమతి ఇవ్వలేదని జూన్ తరువాత విద్యార్థులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చలసాని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *