ఉప‌వాసం ఉండ‌లేద‌ని భార్య‌ను పొడిచి… ఆ త‌ర్వాత తానూ…


ఓ భ‌ర్త మొండిత‌నం… క‌ర్క‌శ‌త్వం ఓ నిండు ప్రాణాన్ని ప్ర‌మాదంలోకి నెట్టింది. ఢిల్లీలో జరిగిన ఈ సంఘ‌ట‌న‌లో భార్య ఉప‌వాసం ఉండ‌లేద‌ని ఆగ్రహానికి గురైన భ‌ర్త ఆమెను పొడిచాడు. ‘కర్వా చౌత్‌’ పర్వదినం జ‌రిగిన ఈ ఉదంతం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. భార్య‌ను పొడిచిన త‌ర్వాత ఆ భ‌ర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

ఢిల్లీకి చెందిన రోహిణి అనే మహిళ కొంతకాలంగా తన పుట్టింట్లోనే ఉంటోంది. ఆదివారం రోహిణి భర్త జస్వీందర్‌ సింగ్‌ తన భార్యను కలవడానికి అత్తగారింటికి వెళ్లాడు. అయితే ఆ రోజు క‌ర్వా చౌత్ ప‌ర్వ‌దినం కావ‌డంతో ఉప‌వాసం ఉన్నావా అని భార్య‌ను అడిగాడు. అయితే, తాను ఉప‌వాసం చేయ‌లేద‌ని ఆమె బ‌దులిచ్చింది. దాంతో ప‌ట్ట‌రాని కోపానికి గురైన అత‌డు ఆమెను ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు. అక్క‌డ వారిద్ద‌రి మ‌ధ్య గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాంతో కోపోద్రిక్తుడైన జస్వీందర్‌ భార్యని కత్తితో దారుణంగా పొడిచాడు.

భార్య‌ను చంపిన త‌ర్వాత తానూ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కొనవూపిరితో ఉన్న రోహిణిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించడంతో ఆమె బతికి బయటపడింది. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి రావడంతో జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కొన్ని నెలల క్రితమే తాను భర్తతో విడిపోయానని అందుకనే కర్వా చౌత్‌ నాడు ఉపవాసం చేయలేదని పేర్కొంది. వీరిద్దరికీ నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. చివ‌ర‌కు భార్య‌ను చంపాల‌నుకున్న జ‌స్వింద‌ర్ తానే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *