రాళ్ల మేక‌ల‌కు మాంచి డిమాండ్‌….!

రాళ్లేమిటి మేక‌లేమిటి అనుకుంటున్నారా….నిజం అండీ బాబు…మేక‌ల పెంప‌కంతో కోట్లు సంపాదిస్తున్నారు కొంద‌రు కేటుగాళ్లు. అయితే ఎలాగ‌బ్బా…అని ఆలోచిస్తున్నారా….అయితే ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి మీకే తెలుస్తుంది. మేక‌ను అమ్మితో మ‌హా అయితే ఐదో, ప‌దో వేల రూపాయ‌లు వ‌స్తాయి…కానీ ఈ మేక‌ల‌కు 50 నుంచి ల‌క్ష రూపాయ‌ల దాకా డిమాండ్ ఉంది. దీనికి కార‌ణం వాటి మాంసం కాదు…. వాటి పొట్ట‌లో ఉండే ఓష‌ద రాళ్లు. సాధార‌ణంగా మేక‌లు తుమ్మ‌గింజ‌లు తింటాయి…ఇవి వాటి పొట్ట‌లోనే ఉండిపోతాయి….ఇవి అర‌గ‌వు..అలాగే వీటితో పాటు అడ‌వుల్లో ఉండే ఔష‌ధ గుణాల చెట్ల ఆకుల‌ను మేస్తాయి. దీంతో తుమ్మ గింజ‌ల‌కు ఆకర్ష‌ణ శ‌క్తి ఎక్కువ కాబ‌ట్టి ఈ ఆకుల‌న్నీ ఔష‌ధ రాళ్లుగా మేక‌పొట్ట‌లో త‌యార‌వుతాయి. అయితే ఇవి ప్ర‌కృతి సిద్ధంగా త‌యారైతే ప‌ర్వాలేదు…కానీ భూపాల‌ప‌ల్లిలో కొంద‌రు స్మ‌గ్ల‌ర్లు, ఫారెస్టు అధికారుల‌తో కుమ్మ‌క్కై గుడారాలు వేసుకుని మేక‌ల‌ను కృత్రిమంగా పెంచుతున్నారు. స‌హ‌జంగా అయితే ఈ ఔష‌ధ రాళ్లు ఒక‌టో రెండో మేక‌ల్లో మాత్ర‌మే ఏర్ప‌డ‌తాయి…వీటిని ముందుగా గుర్తించి రాళ్ల మేక‌లు అని పిలుస్తున్నారు. వీటికి విదేశాల్లో మాంచి డిమాండ్ ఉంది. ఈ రాళ్ల‌ను ర‌క‌ర‌కాల మందుల త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. ఇంతా తెలుసుకున్న కొంద‌రు స్వార్థ‌ప‌రులు ఎలాగైనా సొమ్ము చేసుకోవాల‌నే ఉద్దేశంతో అక్ర‌మ మార్గాల్లో వీటిని త‌యారు చేస్తున్నారు. వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ల‌తో మేక పొట్ట‌కింద భాగంలో ఉండే పేగులో తుమ్మ గింజ‌ల‌ను నింపుతున్నారు. కొన్ని అర‌గ‌కుండా బ‌య‌టికి వ‌చ్చేసినా కొన్ని అలాగే ఉండిపోతాయి త‌ర్వాత మేక ఆకులు అలుములు తిన‌డం వ‌ల్ల ఔష‌ధ గుణాలు ఉండే ఆకుల‌కు ఆకర్షిత‌మై ఇవ్వే ఔష‌ధ రాళ్లుగా త‌యార‌వుతాయి. సంవ‌త్స‌రంలోనే వీటిని కోత‌కు అమ్మేస్తున్నారు. మాంసాన్ని హోట‌ళ్ల‌కు, ఔష‌ధ రాళ్ల‌ను తిరుప‌తి, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు ఈ కేటుగాళ్లు త‌ర‌లిస్తున్నారు. వీటిని మ‌న‌దేశంలో నిషేధించారు. దీంతో హాంకాంగ్‌, సింగ‌పూర్‌, జ‌ర్మ‌నీ, థాయ్‌లాండ్‌, జ‌పాన్ వంటి దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. వీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకున్న స్మ‌గ్ల‌ర్లు భూపాల‌ప‌ల్లిలో 2 వేల గుడారాల్లో ఈ మేక‌ల‌ను కృత్రిమంగా పెంచుతూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నారు. ఇవ‌న్నీ తెలిసినా….అట‌వీ శాఖ అధికారులు కూడా ల‌క్ష‌ల్లో లంచాలు తీసుకుని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *