డేరాబాబా జైల్లో ఎంత సంపాధిస్తున్నాడో తెలుసా…!

కామ‌పిశాచి, అత్యంత క్రూరుడైన గుర్మీత్‌సింగ్ డేరాబాబా ఇద్ద‌రి మ‌హిళ‌ల అత్యాచారం కేసులో 10ఏళ్ళు శిక్ష‌ప‌డ‌డంతో జైల్లో ఊచ‌లు లెక్క‌బెడుతున్నాడు. అయితే ఇత‌గాడు జైల్లో ఒంట‌రిగా లేడ‌ని మ‌రో ముగ్గురు జీవిత ఖైదు అనుభ‌విస్తున్న వారితో ఉంటున్న‌ట్లు జైలు అధికారులు మీడియాకు తెలిపారు. అలాగే ఎప్పుడూ జిగేల్ జిగేల్ దుస్తులు ధ‌రించి, అమ్మాయిలు, వేలాది మంది భ‌క్తుల‌కు ఆరాధుడైన ఈ నీచుడు ఇప్పుడు తోట‌ప‌ని చేస్తున్నాడ‌ట‌. ఏప‌నీ చేత‌కాని వారికి మాత్ర‌మే ఇలాంటి ప‌నులు అప్ప‌జెప్తామ‌ని జైళ్ల‌శాఖ డీజీపీ కేపీ సింగ్ తెలిపారు. హ‌రియాణా జైల్లో ఆ ప‌నిచేసే వారికి రోజుకు రూ.20 మాత్ర‌మే ఫిక్సిడ్ ఇస్తార‌ట‌. అదే ఇస్తున్నామ‌ని చెప్పారు. అలాగా ఈ నీచుడికి టీవీగానీ, వార్తాప‌త్రిక‌లు గానీ ఫోన్ చేసుకునే వీలుకూడా లేద‌ని తెలిపారు. అత‌ని వ‌ద్ద రెండు పుస్త‌కాలు, రెండు జ‌త‌ల చెప్పులు, అత‌గాడు వేసుకున్న బ‌ట్ట‌లు త‌ప్పిస్తే ఏమీలేద‌ని చెప్పారు. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ఠ్యా ఎలాంటి అద‌న‌పు సౌక‌ర్యాలు ఇవ్వ‌డంలేద‌ని ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు. అయ్యే పాపం ఎప్పుడూ అమ్మాయిలు, జ‌ల్సాల‌తో గ‌డిపిన బాబా పిచ్చికుద‌రాలంటే ఇంకా శిక్ష క‌ఠ‌నంగా ఉండాల్సిందే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *