డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు గల్లంతు

రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేస్ దర్యాప్తు వేగం తగ్గిందా? ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో కొందరు ప్రముఖుల పేర్లు గల్లంతు అయ్యాయా? అవుననే అంటున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆరోపించడమే కాదు ఆయన ఏకంగా న్యాయ పోరాటం మొదలు పెట్టారు.

ఈ కేసు బయట పడినపుడే… కొందరి పేర్లను తప్పించేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడే రేవంత్ స్పందించారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపకుంటే న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అన్నట్లుగానే ఇప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కారు. డ్రగ్స్‌ కేసుపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి ఒక పిటిషన్‌ వేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరపాలని ఆయన కోరారు. డ్రగ్స్‌ కేసులో చాలా మంది ప్రముఖుల పేర్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. అయితే రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *