జనసేనలోకి మాజీ స్పీకర్

ఎన్నికల వేడి పెరుగుతుండడంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం సేఫ్ జోన్ లు వెతుక్కుంటున్నారు. ఆలస్యం అమృతం విషం అన్నట్లు… ముందుగానే సీట్లు రిజర్వు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన లోకి కూడా వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీ సీఎం తనయుడు… మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ కి షాకివ్వనున్నారు.

దీనితో ఇప్పుడిప్పుడే బలపడాలని ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి మరో దె్బ్బ తగిలినట్లే. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో స్పీకర్‌గా వ్యవహరించిన  నాదెండ్ల మనోహర్  గురువారం నాడు  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఆయన జనసేనలో చేరనున్నట్లు సమాచారం. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. గురువారం నాడు సాయంత్రం తిరుపతిలో  పవన్ కళ్యాణ్ సమక్షంలో  నాదెండ్ల మనోహర్ ఆ పార్టీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *