కుటుంబాన్నే మింగేసింది…

అమ్మా నాన్న‌, ఇద్ద‌రు కొడుకులు… కోడ‌లు, ఇద్ద‌రు మ‌నువ‌ళ్లు.. అందో ప‌చ్చ‌ని సంసారం. ఇంటిపెద్ద కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి. అయితేనేం కొడుకులు చేసిన త‌ప్పులు… అప్పులు ఆ ఇంట పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇంటి పెద్ద‌తో స‌హా ఆరుగురు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు… సూర్యాపేట‌లో జ‌రిగిన ఈ దా*రుణం* వివ‌రాలు ఇలా ఉన్నాయి.
సూర్యాపేట‌లోని మామిళ్ల‌గ‌డ్డ‌లో నివ‌సించే జ‌నార్ద‌న్ వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ప్ర‌భుత్వ ఉద్యోగి. ఆయ‌న‌కు ఇద్ద‌రు కొడుకులు. వాళ్ల పేర్లు సురేష్‌(33), అశోక్‌(30). సురేష్‌కు తిప్ప‌ర్తికి చెందిన ప్ర‌భాత‌తో ఏడేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వాళ్ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. వాళ్ల పేర్లు శాన్విక (4), రుత్విక (1.5). సురేష్ షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. అందుకోసం ఆయ‌న సుర్యూపేట‌తోపాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు చెందిన వాళ్ల వ‌ద్ద నుంచి దాదాపు ప‌దికోట్లు రుణాలు సేరించాడు. ఫోరెక్స్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టాడు. అయితే ఆయ‌న‌కు అక్కడ న‌ష్టాలు వ‌చ్చాయి. రుణ‌దాత‌ల నుంచి డ‌బ్బుచెల్లించాలంటూ ఒత్తిడి పెరిగింది. దాంతో ఈ నెల 11న పుణేకు అని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో ఈనెల 15వ తేదీన కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సురేష్ క‌నిపించ‌డంలేద‌న్నవిష‌యం తెలుసుకున్న రుణ‌దాత‌లు కుటుంబ‌స‌భ్యుల‌పై ఒత్తిడి తెచ్చారు. ఒక రాజ‌కీయ నాయ‌కురాలి అనుచ‌రుడైతే పోలీసుల ద్వారా ఒత్తిడి చేయించాడు.
అశోక్ ప‌రిస్థితి కూడా బాగాలేదు. వాస్త‌వానికి కోర్టులో జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తాన‌న్న అధికార‌పార్టీ నాయ‌కుడి బంధువు మాట‌లు న‌మ్మాడు. అత‌నికి 14 ల‌క్ష‌లు ఇచ్చాడు. స‌ద‌రు వ్య‌క్తి న‌కిలీ అపాయింట్‌మెంట్ ఆర్డ‌ర్ చేతిలో పెట్టాడు. దాంతో అశోక్ వెళ్లి నిల‌దీశాడు. దాంతో డ‌బ్బు తిరిగి ఇస్తాన‌ని ఒప్పందం చేసుకున్నాడు. ఆయ‌న ఇచ్చిన గ‌డ‌వు పూర్త‌యినా డ‌బ్బు ఇవ్వ‌లేదు. పైగా ప‌రుష ప‌ద‌జాలంతో అవ‌మానించాడు. ఇద్ద‌రు కొడుకుల వ్య‌వ‌హారంతో ఆ కుటుంబంపై రుణ‌దాత‌ల ఒత్తిడి పెరిగింది. అవ‌మానాలు ఎదుర‌య్యాయి. దాంతో కుటుంబ పెద్ద జ‌నార్ద‌న్‌, ఆయ‌న భార్య చంద్ర‌క‌ళ (50), అశోక్‌, ప్ర‌భాత‌లు కూల్‌డ్రింక్‌లో విషం క‌లుపుకొని తాగారు. శాన్విక‌, రుత్విక‌ల‌కు తాపారు. సోమ‌వారం ఉద‌యం పాలు పోసేందుకు వ‌చ్చిన వ్య‌క్తి అనుమానం వ‌చ్చి చుట్టుప‌క్క‌ల వాళ్ల‌కు స‌మాచారం అందించాడు. వాళ్లు కిటికీ అద్దాలు ప‌గుల‌గొట్టి చూడ‌డంతో ఆత్మ‌హ‌త్య‌ల విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తాము ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డానికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ అశోక్‌, ప్ర‌భాత వేర్వేరుగా సూసైడ్‌నోట్‌లు రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *