సుప్రీం ఆదేశాల‌తో జ‌గ‌న్‌కే కొత్త చిక్కులు?

అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత‌, శ‌శిక‌ళ మీద న‌మోదైన కేసుల్లో తీర్పు రావ‌డానికి కొన్నేళ్లు ప‌ట్టింది. ఈ లోపు జ‌య మ‌ర‌ణించారు. అనూహ్యంగా ఆ త‌ర్వాత వ‌చ్చిన తీర్పుతో శ‌శిక‌ళ ఇప్పుడు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. అయితే, చాలా కేసుల్లో విచార‌ణ‌కు ఏళ్ల‌కు ఏళ్లు స‌మ‌యం ప‌డుతుండ‌డంతో అవినీతి నేత‌లంతా ద‌ర్జాగా ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కీల‌క హామీ అవినీతి రాజ‌కీయ నాయ‌కుల అంతు చూస్తాన‌ని. ఆ హామీని విశ్వ‌సించిన జ‌నం మోడీని అంద‌లం ఎక్కించారు. అయితే మూడేళ్లు గ‌డిచినా మోడీ మాత్రం అవినీతి నేత‌ల‌కు వ్య‌తిరేకంగా తీసుకున్న చ‌ర్య‌లేమిటో తేలియ‌దు.

ఈ క్ర‌మంలోనే సుప్రీం కోర్టు సోమ‌వారం వెలువ‌రించిన ఆదేశాలతో ప్ర‌ధాని మోడీ త‌న చిత్త‌శుద్ది నిరూపించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అవినీతి నేత‌ల అంతు తేల్చేందుకు…వారి అక్ర‌మాల‌కు క‌ళ్లెం వేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి రాజ‌కీయ నేత‌ల‌పై ఉన్న అవినీతి అరోప‌ణ‌ల సంగ‌తి తేల్చేయాల‌ని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఇప్పుడు ఈ ఆదేశాలే ఏపీలోని ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఇక్క‌ట్లు తెచ్చి పెట్ట‌నున్నాయ‌ని ఇక్క‌డి అధికార టీడీపీ నేత‌లు చెబుతున్నారు. సుప్రీం ఆదేశాల మేర‌కే తక్ష‌ణం కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే… జ‌గ‌న్ ఎదుర్కొంటున్న అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ వేగ‌వంతం అవుతుంద‌న్న‌ది టీడీపీ నేత‌ల వాద‌న‌. కోర్టుల్లో జ‌రిగే విచార‌ణ‌లో జ‌గ‌న్ అవినీతి నిరూపిత‌మైతే ఆయ‌నకు రాజ‌కీయం జీవితానికి అవ‌రోధాలు త‌ప్ప‌వ‌ని దేశం నేత‌లు జోస్యం చెబుతున్నారు.

దేశంలోనే అవినీతి కేసులు ఎదుర్కొంటున్న రాజ‌కీయ నేత‌ల్లో జ‌గ‌న్ మొద‌టి వ‌ర‌సులో ఉన్నార‌ని చెబుతున్న టీడీపీ నేత‌లు… ఇప్ప‌టికే ప్ర‌తి శుక్ర‌వారం ఆయా కేసుల‌లో ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌వుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ఇలా ఒక‌వైపు అవినీతి కేసుల‌లో కోర్టుల‌కు వెళ్తున్న జ‌గ‌న్… ముఖ్య‌మంత్రి అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని సుప్రీం ఆదేశాల మేర‌కు కేంద్రం ఫాస్ట్ ట్రాక్‌కోర్టులు ఏర్పాటు చేస్తే ముందుగా వాటిలో విచార‌ణ జ‌రిగేది జ‌గ‌న్ కేసులేన‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

కాగా, ప్ర‌జాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడానికి సరికొత్త ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు చట్టం చేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశించింది. ప్రజాప్రతినిధుల ఆస్తులు తక్కువ కాలంలోనే వేగంగా పెరిగాయంటూ లోక్‌ప్రహరీ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. లోక్‌ప్రహరీ పేర్కొన్న ప్రజాప్రతినిధుల ఆస్తులను పరిశీలించి 7 గురు ఎంపీ లు, 98 మంది ఎమ్మెల్యేల పేర్లతో సీబీడీటీ ఇచ్చిన జాబితాను ధర్మాసనం స్వీకరించింది. ఆ పేర్లను, ప్రజా ప్రతినిధుల ఆస్తుల పెంపు అంశాన్ని తాము పరిశీలిస్తామన్నది. 2014లో ఎన్నికైన ఓ ఎంపీ 2019లో అఫిడవిట్‌ దాఖలు చేసినప్పుడు అతడి ఆస్తులు 5-10 రెట్లు పెరిగినట్టు పేర్కొంటే సదరు ఎంపీ ఆదాయంపై దర్యాప్తు చేయాలని తెలిపింది. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలివ్వడాన్ని కేంద్రం మానుకోవాలని, పార్లమెంటే ఈ సమస్యను పరిష్కరించే చట్టాన్ని రూపొందించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *