కన్న‌తండ్రే అన్నంలో విషం క‌లిపి బిడ్డ‌ను క‌డ‌తేర్చాడా…?

ప‌సిపిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులే ప్ర‌పంచం. అందులోనూ త‌ల్లిలేని ఆ పిల్ల‌ తండ్రి ప్రేమ‌లో ఎంతో హాయిగా పెరుగుతున్నా అనుకుంది. కానీ అన్నెంపున్నెం ఎరుగ‌ని నాలుగేళ్ళ చిట్టిత‌ల్లిను ఆ క‌న్న‌తండ్రే కాల‌య‌ముడి రూపంలో క‌డ‌తేర్చాడు. ఎంతో ప్రేమ‌గా రాత్రి అన్నం తిని బ‌జ్జుకున్న బాలిక అర్థ‌రాత్రి ఉన్న‌ట్టుండి అస్వ‌స్థ‌త‌కు గురైంది. ద‌గ్గ‌ర‌లోకి ఆసుప‌త్రికి తీసుకెళ్ళ‌గా ప‌రిస్థితి విష‌మించింద‌ని నీలోఫ‌ర్‌కు తీసుకెళ్ళాల‌ని సూచించారు. మార్గంలోనే ఆ ప‌సిత‌ల్లి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. ఆమె క‌న్న‌తండ్రే రెండో పెళ్ళాంతో క‌లిసి అడ్డుగా ఉంద‌ని భావించి చంపేశార‌ని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం రంగారెడ్డి జిల్లా మంచాల మండ‌లం బోడ‌కొండ తంగాకు చెందిన కరంటోతు యాద‌గిరి (33) కి ఇద్ద‌రు పిల్ల‌లు త‌నుష్క‌(4), చ‌ర‌ణ్‌రాజ్‌. అత‌ని మొద‌టి భార్య సుశీల సంవ‌త్స‌రం క్రితం యాక్సిడెంట్‌లో చ‌నిపోయింది. సంధ్య అనే మ‌హిళ‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి…త‌నుష్క ఉంటే త‌న‌కు పుట్ట‌బోయే బిడ్డ‌కు అడ్డుగా ఉంటుంద‌ని భావించిన సంధ్య భ‌ర్త‌ను ఉసిగొల్పి త‌నుష్క మ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌ని చిన్న‌రి బంధువులు ఆందోళ‌న‌కు దిగారు. పోస్ట్‌మార్టం కోసం బాలిక మృత‌దేహాన్ని ఉస్మానియాకు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. సుశీల మ‌ర‌ణానికి కూడా యాద‌గిరే కార‌ణ‌మ‌ని అత‌డు కావాల‌నే న‌డిరోడ్డుపై వారిని ప‌డేసి ప‌ట్టించుకోకుండా పారిపోవ‌డం వ‌ల్లే మొద‌టి భార్య చనిపోయింద‌ని ఆరోపించారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో సుశీల చ‌నిపోగా పిల్ల‌లు గాయాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డార‌ని చెప్పారు. పిల్ల‌ల విష‌యంలో రెండో భార్య‌తో జ‌గ‌డాలు వ‌స్తుండ‌డంతో వారి పీడ‌ను వ‌దిలించుకోవాల‌నే యాద‌గిరి ఈ దురాఘ‌తానికి పాల్ప‌డ్డాడ‌ని త‌నుష్క బంధువులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *