రైల్లో సీటు ఇవ్వ‌లేద‌ని ఆ మ‌హిళ ఏకంగా…

ట్రైన్‌లోనో… బ‌స్సులోనో సిటు విష‌యంలో జ‌రిగే గొడ‌వ‌లు ప్ర‌తి ఒక్క‌రికీ అనుభ‌వమే. అది చైనా అయినా… మరే దేశ‌మైనా గొడ‌వ మాత్రం కామ‌నే. ఇదే విష‌యాన్ని నిరూపించే వీడియో ఇది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చైనాలోని ఒక రైలులో సీటు విష‌య‌మై ఒక మ‌హిళ‌, యువ‌కుడు మ‌ధ్య జ‌రిగిన వాదులాట‌కు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.


చైనాలోని నాన్‌జింగ్ ప‌ట్ట‌ణంలో స‌బ్‌వే మెట్రోరైలులో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రైలులో అంగ‌వైకల్యం ఉన్న వారు కూర్చునే సీటు కోసం ఓ మ‌హిళ, మ‌రో యువ‌కుడు వాదించుకున్నారు. చివ‌ర‌కు యువ‌కుడు అందులో కూర్చున్నాడు. అయితే, ఆ సీటు త‌న‌కే ఇవ్వాలంటూ ఆ మ‌హిళ తీవ్రంగా వాదులాడింది. అయినా స‌రే ఆ యువ‌కుడు స‌సేమీరా అన్నాడు. చివ‌ర‌కూ ఆ మ‌హిళ అత‌డి మీద‌నే కూర్చుని ప్ర‌యాణం చేసింది. ఇలా సీటు కోసం కొట్టుకున్న ఇద్ద‌రూ విక‌లాంగులే కావ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *