రుణ‌దాత‌ల వేధింపుల‌కు తాళ‌లేక‌… మ‌ర‌ణ‌వాంగ్మూలం వీడియో తీసుకొని … ఆ త‌ర్వాత‌


అవ‌స‌రం కోసం వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద డ‌బ్బు అప్పుగా తీసుకున్నాడు. కొంత‌కాలం త‌ర్వాత వ‌డ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు మొద‌ల‌య్యాయి. చంపేస్తామంటూ బెదిరించారు. ఇక బ‌తికుండ‌డం వ్య‌ర్థ‌మ‌ని అనుకున్నాడు. త‌న మ‌ర‌ణానికి కార‌ణాల‌ను వివ‌రిస్తూ మొబైల్‌లో వీడియో తీసుకున్నాడు . ఆ త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైద‌రాబాద్ శివారులోని మైలార్‌దేవుప‌ల్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

మ‌హ్మ‌ద్ షాహెద్ హుస్సేన్ కార్పెంట‌ర్‌. అత‌నికి ఒక దుకాణం కూడా ఉంది. రెండేళ్ల క్రితం అవ‌స‌రానికి మ‌హ్మ‌ద్ అబ్దుల్ అలీ, ష‌బీన్‌బేగం, కైలాష్‌రాజ్‌పుత్‌, భ‌ర‌త్‌బాయ్‌, సుల్తానాబేగంల వ‌ద్ద అప్పులు చేశాడు. వాటికి కొంత వ‌డ్డీ కూడా చెల్లించాడు. అయితే కొంత‌కాలంగా రుణ‌దాత‌ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఫోన్ చేసి డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే అంతు చూస్తామ‌ని బెదిరిస్తున్నారు.

ఫోన్ ఎత్త‌క‌పోతే దుకాణానికి, ఇంటికి వెళ్లి  దౌర్జ‌న్యానికి దిగుతున్నారు. దాంతో షాహెద్ హుస్సేన్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. త‌న మ‌ర‌ణానికి కార‌ణాలు వివ‌రిస్తూ సెల్ఫీ వీడియో దిగాడు. అనంత‌రం దుకాణంలో ఉరేసుకొని మ‌ర‌ణించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *