పెళ్లి చేసుకోమ‌ని అడిగింద‌ని.. గుట్ట‌ల్లోకి తీసుకెళ్లి…

ఆమె ఇంట‌ర్ చ‌దువుతోంది.. మ‌దీనాగూడ‌లో నివాసం. అదే ప్రాంతానికి చెందిన యువ‌కుడు ప‌రిచ‌య‌మ‌య్యాడు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరిగింది. పెళ్లి చేసుకోవాల‌ని అడుగుతోంది.. దాంతో ఆ యువ‌కుడు ఆమెను గుట్ట‌ల్లోకి తీసుకెళ్లాడు.. హ‌త్య చేశాడు.. హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఇంట‌ర్ విద్యార్థిని చాందినీ హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది..
ఫ్రెండ్స్‌ను క‌లిసి వ‌చ్చేస్తాన‌ని సోద‌రికీ, త‌ల్లికి చెప్పి ఇంట్లో నుంచి బ‌య‌లుదేరి వెళ్లిన ఆ అమ్మాయి ఆ త‌ర్వాత ఇంటికి రాలేదు. ఎన్నిసార్టు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వ‌చ్చింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన బాలిక అమ్మానాన్న త‌న స్నేహితుల‌కు కూడా ఫోన్ చేసి వాక‌బు చేశారు. వారు త‌మ‌కు తెలియ‌ద‌ని చెప్పారు. స‌రే ఉద‌యం వ‌రకు ఎదురు చూసిన వారికి ఎలాంటి స‌మాచారంలేదు. దీంతో పోలీస్‌స్టేష‌న్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సాయంత్రం పీఎస్ నుంచి ఫోన్ అమీన్‌పూర్ గుట్ట‌ల్లో ఓ మృత‌దేహం ఉంద‌ని పోలీసులు చెప్పారు. అది వారి అమ్మాయి కాకుండా ఉండాల‌ని ఎన్నో దేవుళ్ల‌కు మొక్కుకున్నారు. కానీ తీరా వెళ్ళి చూస్తే అది వారి గారాల ప‌ట్టి అని తెలియ‌డంతో గుండ‌ల‌విసేలా రోధిస్తున్నారు. పూర్తి క‌థ‌నంలోకి వెళ్తే…. కూక‌ట్‌ప‌ల్లికి చెందిన వ‌స్త్ర వ్యాపారి కిషోర్‌జైన్‌కు ఇద్ద‌రు కుమార్తెలు. చిన్న‌కుమార్తె చాందిని (17) సిల్వ‌ర్ ఓక్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ళాశాల‌లో ఇంట‌ర్ ఫ‌స్ట్‌ ఇయ‌ర్ చ‌దువుతోంది. ఈనెల 9 న స్నేహితుల‌ను క‌లిసివ‌స్తాన‌ని వెళ్లిన చాందిని దారుణ హ‌త్య‌కు గురైంది. అమీన్‌పూర్ గుట్ట‌ల్లోకి శ‌వ‌మై క‌నిపించింది. తొలుత ఆత్మ‌హ‌త్య‌గా భావించారు. కానీ ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఎవ‌రైనా ప‌థ‌కం ప్ర‌కారం చాందినిని కిడ్నాప్ చేసి హ‌త్య చేశారా..అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఎంతో చ‌లాకీగా ఉండే చాందిన అంద‌రితో క‌లిసిమెల‌సి ఉండేద‌ని…ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డేది కాద‌ని తెలిసింది. చాందిన సెల్‌ఫోన్‌లో ఎక్కువ‌సార్లు మ‌దీనాగూడ‌లో ఉండే సాయికిర‌ణ్‌తో మాట్లాడిన‌ట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అత‌డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అత‌డు నేరాన్ని అంగీక‌రించాడు. అయితే బాలిక మృత‌దేహం వ‌ద్ద అనేక మందుబాటిళ్లు కూడా దొరికాయి. అలాగే అమ్మాయి బ‌ట్ట‌లు ఒంటిపై చింద‌ర‌వంద‌ర‌గా ఉండ‌డం చూస్తే అమెపై అత్యాచారం చేసి హ‌త్య‌చేసి ఉంటారా అనే కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌రుగుతోంది.
ఆ అబ్బాయే ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు..
కుటుంబ‌స‌భ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం చాందినికి సాయికిర‌ణ్ ప‌దిరోజుల క్రితమే ప‌రిచ‌యం అయ్యాడు. చాందిని ఫోన్‌లో అత‌ని నెంబ‌ర్‌ను మై హార్ట్ అని సేవ్ చేసుకుంది. వారం రోజులుగా చాందిని ముభావంగా ఉంద‌ని ఎన్నిసార్లు అడిగినా చెప్ప‌లేద‌ని ఇంత ఘాతుకం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌ని ఆమె సోద‌రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అత‌నిని క‌ల‌వ‌డానికి వెళ్లి ఇలా విగ‌త జీవిగా మారింద‌ని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *