గుత్తా జ్వాలకు కొత్త బాధ్య‌త‌లు

భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొత్త బాధ‌తల్లో క‌నిపించింది. బ్యాడ్మింట‌న్ డబుల్ క్రీడాకారిణిగా అభిమానుల‌ను అల‌రిస్తున్న జ్వాలకు పెద్ద ప‌ద‌వి ద‌క్కింది. ఇక‌పై ఆమె ఆట‌తో అభిమానుల‌ను అల‌రించ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే భార‌త్‌బ్యాడ్మింట‌న్ సంఘం ఆమెకు కోచ్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. సంఘం తాజాగా బ్యాడ్మింట‌న్ సింగిల్‌, డ‌బుల్స్ కు కొత్త కోచ్‌ల‌ను ఎంపిక చేసింది. మ‌హిళ‌ల డ‌బుల్స్ బాధ్య‌త‌ను జ్వాల‌కు కేటాయించింది. ప్ర‌స్తుతం జ్వాల వ‌య‌సు 33 ఏళ్లు. ఆమె ఆరేళ్ల‌కే బ్యాడ్మింట‌న్ రాకెట్ ప‌ట్టుకుంది. బ్యాడ్మింట‌న్ డబుల్స్ క్రీడాకారిణిగా దేశానికి అత్యున్న‌త విజ‌యాల‌ను అందించారు. 2009సూప‌ర్‌సిరీస్‌లో మిక్స్‌డ్ డ‌బుల్స్‌లో ర‌జితం, 2011లో ప్ర‌పంచ చాంపియ‌న్ షిప్ డబుల్స్ లో కాంస్యం, 2010 కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణం, 2014లో ర‌జితంతోపాటు అనేక ప‌త‌కాల‌ను సాధించింది. చైనీస్ తైపీ ఓపెన్‌, బ‌ల్గేరియా ఓపెన్‌, బిట్‌బ‌ర్గ‌ర్ ఓపెన్‌, ఇండియా ఓపెన్‌, కెన‌డా ఓపెన్ చాంపియ‌న్ షిప్‌ల‌లో డ‌బుల్స్ విభాగంలో విజేత‌గా నిలిచింది. రియోఒలింపిక్స్ లోనూ పాల్గొంది. జాతీయ చీఫ్ కోచ్‌గా పుల్లెల గోపీచందే కొన‌సాగుతారు. జ్వాల‌తోపాటు పెద్ద సంఖ్య‌లో కోచ్‌ల‌ను నియ‌మించింది. పురుషుల సింగిల్స్ కు 21మందిని, పురుషుల డబుల్స్ కు 12మందిని, మ‌హిళ‌ల డ‌బుల్స్ కు న‌లుగురిని కోచ్‌లుగా నియ‌మించింది. జూనియ‌ర్స్ విభాగంలో బాలుకు 21మందిని, బాలిక‌ల‌కు 10 మందిని కోచ్‌లుగా నియ‌మించారు. మొత్తం న‌లుగురు స‌భ్యుల‌తో స‌ల‌హాదారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ద్రోణాచార్య అవార్డు గ్ర‌హీత ఆరిఫ్‌కు స్థానం క‌ల్పించారు. మ‌హిళ‌ల డ‌బుల్స్ విభాగంలో జ్వాల‌తోపాటు మ‌ధుమిత బిస్త్ర్, ప్ర‌ద్య్న గాద్రె, ఓలి డేకాల‌ను కోచ్‌లుగా నియ‌మించారు. సీనియ‌ర్ విభాగం కోచ్‌ల‌లో విమ‌ల్‌కుమార్‌, చేత‌న్ ఆనంద్‌, అనిల్‌కుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *