అత‌డు క‌రాచీలోనే ఉన్నాడు…

మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హీం మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాడు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నాడు… ఎలా ఉన్నాడు…చావు బ‌తుకుల్లో ఉన్నాడ‌న్న వార్త‌ల్లో నిజ‌మెంత అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మ‌ధానాలు దొరికాయి. సీఎన్ ఎన్ న్యూస్ 18 ఎడిట‌ర్ (ఇన్వెస్టిగేష‌న్స్) మ‌నోజ్ గుప్తా స్వ‌యంగా దావూద్‌తో మాట్లాడారు. దాంతో అనేక వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. దావూద్ అనారోగ్యం వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. ఆయ‌న పాకిస్తాన్‌లోని క‌రాచీలో ఉన్నాడు. త‌న మ‌న‌షుల‌తో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూనే ఉన్నాడు. మ‌నోజ్ క‌రాచీకి ఫోన్ చేశారు. దావూదే ఫోన్ ఎత్తి మాట్లాడారు. గుప్తా త‌న‌ను ప‌రిచ‌యం చేసుకోగానే ఆయ‌న తాను చోటాని అని చెప్పాడు. ఆ త‌ర్వాత దుబాయ్‌లో దావూద్ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టే జావెద్ చోటానీ లైన్‌లోకి వ‌చ్చాడు. గుప్తాతో మాట్లాడారు. దావూద్ సూచ‌న‌ల మేర‌కే చోటానీ మాట్లాడారు. మీరు క‌రాచీలో ఉన్నారు క‌దా అని గుప్తా ప్ర‌శ్నిస్తే మీకు ఎవ‌రు చెప్పారంటూ చోటానీ ఎదురు ప్ర‌శ్నించారు. ఇది పాకిస్తాన్ నంబ‌ర్ క‌దా అని ప్ర‌శ్నిస్తే అన‌వ‌స‌రంగా టైమ్ వేస్తు చేసుకోవ‌ద్ద‌ని చెప్పాడు. మీరు ఫోన్ చేయ‌గానే దావూద్ లిఫ్ట్ చే సి ఇంట‌ర్వ్యూ ఇస్తార‌ని అనుకున్నారా అంటూ చోటానీ మండిప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *