ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది హ‌నీప్రీతే


డేరా బాబా అరెస్టు త‌ర్వాత హ‌ర్యానాలో అల్ల‌ర్లు చెల‌రేగాయి. పంచ‌కుల‌లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 38 మంది అమ‌యాకులు బ‌ల‌య్యారు. ఈ అల్ల‌ర్లు ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగినేవ‌న‌ని డేరాబాబా ద‌త్త‌పుత్రిక హ‌నీప్రీత్ అంగీక‌రించారు. అంతేకాదు ఆ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది కూడా తానేన‌ని ఒప్ప‌కున్నారు. అల్ల‌ర్ల‌కు సంబంధించి ఆమె కీల‌క స‌మ‌చారం అందించార‌ని పోలీసులు తెలిపారు.

డేచా స్వ‌చ్ఛ సౌదా చీఫ్ రాంర‌హీమ్ సింగ్ ఇద్ద‌రు సాద్విల‌పై అత్యాచారం కేసులో దోషి అని తేలింది. ఆయ‌న‌కు 20 ఏళ్ల‌పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వ‌తా పంజాబ్‌, హ‌రియాణాల్లో అల్ల‌ర్లు చెల‌రేగాయి. తీర్పు ప్ర‌క‌టించిన కోర్టు ఉన్న పంచ‌కుల ప‌ట్ట‌ణంలో అల్ల‌రిమూక చెల‌రేగిపోయింది. 38 మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఆ అల్ల‌ర్ల త‌ర్వాత బాబా ద‌త్త‌పుత్రిక హ‌నీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దాంతో అల్ల‌ర్ల‌కు ఆమె కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానించారు. ఆమె కోసం వేట ప్రారంభించి చివ‌ర‌కు ప‌ట్టుకున్నారు.

అత్యాచారం కేసులో డేరాబాబాకు శిక్ష ప‌డితే ఏమిట‌న్న ప్ర‌శ్న మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 17వ తేదీన డేరా ఆశ్ర‌మంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. కేసులో కోర్టు శిక్ష విధిస్తే అల్ల‌ర్లు చేసేందుకు ప‌థ‌క ర‌చ‌న చేశారు. అల్ల‌ర్ల‌కు అవ‌స‌ర‌మై ముఖ్య స‌రంజామాను డేరా ముఖ్యులు స‌మ‌కూర్చారు. ఆగ‌స్టు 25వ తేదీ పంచ‌కుల కోర్టు బాబాను దోషిగా తేల్చింది. అదే రోజు అత‌డిని అరెస్టు చేశారు. అంతే హ‌నీప్రీత్ అల్ల‌ర్ల ప్లాన్‌ను అమ‌లు చేశారు. సాధార‌ణ పౌరులే ల‌క్ష్యంగా హింస‌కు పాల్ప‌డ్డారు. అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. అనంత‌రం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *