భార్యతో మద్యం తాగించి… ఆపై వీడియో తీసి…

తలా వంచి తాళి కట్టించుకుని… కన్నవారిని వదిలేసి వచ్చిన భార్యకి అతడు నరకం చూపించాడు. వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా బలవంతంగా మద్యం తాగించి ఆపై తీవ్రంగా హింసించడం అతడి దినచర్య అయింది. భర్త ఆగడాలను భరించలేని ఆ పడతి చివరకు ఈ మొగుడు నాకొద్దంటు పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత రాష్ట్ర మహిళ కమిషన్ కూ ఫిర్యాదు చేసింది.

బెంగ‌ళూరులోని విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఉదంతం కలకలం రేపింది. ‘రూపు రేఖల్లో నా మాజీ ప్రేయసిని తలపిస్తున్నావు. నిన్ను అదే పేరుతో పిలుస్తాను. నిన్ను చూస్తే ఆమే గుర్తుకు వస్తోంది’ అంటూ సతాయిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో వాపోయారు. భర్త చెర నుంచి తనను రక్షించాలని వేడుకొన్నారు.

అసెంచర్‌ సంస్థలో లక్షల రూపాయల వేతనం అందుకుంటున్న వ్యక్తి… మైసూరుకు చెందిన యువతిని పెళ్లాడాడు. మొదటి మూడు నెలలు అన్యోన్యంగా ఉన్నా.. తరువాత భార్యను హనీమూన్‌ కోసం మారిషస్‌కు తీసుకెళ్లాక అతని వికృత చేష్టలు పరిధులు దాటడం మొదలైంది. అక్కడే ఆమెకు మద్యం తాగించేందుకు విఫలయత్నం చేశాడు. ‘ఇది తాగితే మత్తు రాదు. ఏమీకాదు. హనీమూన్‌లో నిరాశ పరచవద్దు’ అంటూ ఆమెనుతో బలవంతంగా తాగించాడు. ఆ తరువాత ఆమె చేష్టలను ఫోన్లో చిత్రీకరించుకుని దాచి పెట్టుకున్నాడు.

అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి నిత్యం మద్యం తాగాలంటూ బెదిరిస్తూ.. ఫోన్లోని దృశ్యాలను చూపుతూ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతుంటే.. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు పుట్టింటి నుంచి భారీగా నగదు తీసుకు రావాలని వేధిస్తున్నార‌ని వాపోయారు. వివాహ సమయంలో 800 గ్రాముల ఆభరణాలు, రూ.20 లక్షల నగదును లాంఛనంగా తీసుకుని ఇపుడు మరింత కావాలంటున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. అయితే ఆ భర్త మాత్రం వేరే కథనం వినిపిస్తున్నాడు. తనతో కాపురం చేయడం ఇష్టం లేకనే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని చెబుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *