భ‌ర్త‌ను గుడికి తీసుకెళ్లి… అక్క‌డ ప్రియుడితో క‌లిసి

పెళ్లంటే నూరేళ్ల పంట. దాంప‌త్యం అంటే రెండు హృద‌యాల క‌ల‌బోత‌. కానీ ఆ యువ‌కుడి క‌ల పెళ్లి త‌ర్వాత మూడు నెల‌ల‌కే తెల్లారిపోయింది. నిండు నూరేళ్ల‌ జీవితం భార్య వివాహేత‌ర సంబంధానికి బ‌లైపోయింది. తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఈ ఉదంతంలో పాతికేళ్ల‌కే ఓ యువ‌కుడు భార్య‌, ఆమె ప్రియుడి చేతిలో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరానికి, ద్రాక్షారామానికి చెందిన జయలక్ష్మికి ఈ ఏడాది మేలో వివాహం అయ్యింది. జయలక్ష్మి నర్సుగా పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి త‌ర్వాత వీరేష్‌ను క‌ల‌వ‌డం జ‌య‌ల‌క్ష్మికి కుద‌ర‌డం లేదు. దాంతో భ‌ర్త‌నే అడ్డు తొలంగిచేసింది. ఇందుకోసం ప్రియుడితో క‌లిసి ప‌క్కా స్కెచ్ వేసింది.

గుడికి వెళ్లి వ‌ద్దామంటూ ఆగ‌స్టు 29న శంక‌రాన్ని తీసుకుని జ‌య‌ల‌క్ష్మి గౌరీప‌ట్నంలోని నిర్మ‌ల‌గిరికి వెళ్లింది. వారిని ఫాలో అవుతూ ఆమె ప్రియుడు వీరేష్ కూడా అక్క‌డికి చేరుకున్నాడు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం భర్తతో గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేయించింది. దీంతో భీమశంకరం తనకు నీరసంగా ఉందని చెప్పారు. ఇదే ఛాన్స్‌గా భావించిన కిలాడీ లేడీ కపట ప్రేమను వలకబోస్తూ నీరసం పోవడానికి అంటూ ఓ హైపవర్‌ డ్రగ్‌ను ఇంజెక్షన్‌‌ను చేసింది. అంతే, కొద్దిసేపటికే అతను మృతి చెందాడు. ఆ తర్వాత ప్రియుడితో క‌లిసి జ‌య‌ల‌క్ష్మి అక్క‌డి నుంచి ప‌రారైంది. ఆ త‌ర్వాత అక్క‌డే ప‌డి ఉన్న శంక‌రం మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

తొలుత అనుమాన‌స్ప‌ద మృతిగా భావించిన పోలీసులు చివ‌ర‌కు మృతుడు బీమ‌శంక‌రంగా గుర్తించారు. ద‌ర్యాప్తులో భాగంగా ఆయ‌న భార్య జ‌య‌ల‌క్ష్మిని ప్ర‌శ్నించ‌గా ఆమె ఇచ్చిన స‌మాధానాలు పోలీసుల్లో అనుమానాలు పెంచాయి. దాంతో తమ‌దైన శైలీలో విచారించగా తాను చేసిన దురాగ‌తాన్ని ఆమె అంగీక‌రించింది. దాంతో పోలీసులు జ‌య‌ల‌క్ష్మితో పాటు, వీరేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *