తమ్ముడితో సంబంధం పెట్టుకుని చివరికి భర్తను….

సొంత తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డు వస్తున్నాడని భర్తనే హతమార్చిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కాకినాడలో బయటపడిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్‌ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు.

 

సొంత తమ్ముడు (ఆమె తండ్రి రెండో భార్య కుమారుడు) భానుప్రసాద్‌తో హిమచందు నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్త హరిప్రసాద్‌కు తెలిసి అనేక సార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పూలేదు. దీంతో భా ర్యా భర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు.ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని హిమచందు, భానుప్రసాద్‌ భావించారు.

 

హత్య చేసేందుకు పథకం రూపొందించారు. శుక్రవారం రాత్రి హరిప్రసాద్‌ తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉండడంతో హరిప్రసాద్‌ను కొట్టి, ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు. భానుప్రసాద్‌ తన స్నేహితులతో కలిసి చనిపోయిన హరిప్రసాద్‌ను మోటార్‌ సైకిల్‌పై తీసుకెళ్లి రమణయ్యపేట కాలువ పక్కన ఉన్న డంపింగ్‌ యార్డులో టైర్లు, చెత్త వేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు.

హరిప్రసాద్‌ కోసం ఆయన తండ్రి ఇంటికి వెళ్లగా బయటకు వెళ్లారని హిమచందు చెప్పింది. అయితే ఎంతకు అతడు తిరిగి రాకపోవడంతో హరిప్రసాద్‌ తమ్ముడు రాయుడు శ్రీను సర్పవరం పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నగరంలోని ఓ ప్రాంతంలో సగం కాలి ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సగం కాలిన మృతదేహం రాయుడు హరిప్రసాద్‌దేనని గుర్తించారు. ఆ తరవాత హిమచందును ప్రశ్నించడంతో తాను చెందిన ఘోరం అంగీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *