ఫ్రెండుకు భార్యని పరిచయం చేస్తే… ఇంటికి వచ్చేసరికి బెడ్రూంలో…

దేశం కానీ దేశం. పైగా ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆ నమ్మకంతోనే ఇంటి పక్కన ఇల్లు ఇప్పించాడు. మిత్రుడే కదా అని భార్యని పరిచయం చేశాడు. ఆ పరిచాయమే… అతడి వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.

దుబాయిలో ఉద్యోగం చేసుకుంటున్న 27 ఏళ్ల సిరియన్ 21 ఏళ్ల భార్యతో అన్యోన్యంగా కాపురం చేస్తున్నాడు. ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేసే అతడు… తన స్నేహితుడు కూడా దుబాయికి రావడంతో తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్ ఇప్పించాడు. అతడు కూడా అదే రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. తన భార్యకు మిత్రుడిని పరిచయం చేశాడు. చాలా మంచివాడనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా చెప్పాడు.

షిప్టుల వారీగా నడిచే ఆ రెస్టారెంట్‌లో.. మిత్రులిద్దరు వేర్వేరు సమయాల్లో విధులకు వెళ్లేవారు. భర్తకు రోజూ రాత్రి ఒంటిగంట వరకూ డ్యూటీ ఉంటుంది. అతడి స్నేహితుడు ఉదయం వెళ్లి సాయంత్రం కాగానే తన ఫ్లాట్‌కు వచ్చేస్తాడు. అదే వారి కొంపముంచింది. భర్త కంటే అందంగా కనిపించడంతో అతడి స్నేహితుడిపై భార్య మోజుపడింది. అతడు కూడా ఆమెపై మనసు పడ్డాడు. ఇద్దరి పరిచయం చివరకు అక్రమ సంబంధానికి దారి తీసింది. అది మొదలు కుదిరినపప్పుడల్లా వాళ్లిద్దరూ శారీరక కోర్కెలు తీర్చుకుంటున్నారు.

కొన్నాళ్ళకు భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చినా స్నేహితుడిని అడగలేక సతమతమయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు తాను బయటకు వెళ్తున్నానని భార్య తన భర్తకు మెసేజ్ చేసింది. బయట ఉన్నప్పుడు దిగిన ఫోటోను వాట్సప్ చేయమని భర్త అడిగితే ‘నాపై నమ్మకం లేదా’ అంటు బుకాయించింది. ఇక ఏమి అనలేక అతడు సైలెంట్ అయిపోయాడు.

ఆ తర్వాత హోటల్ లో ఉండలేక రాత్రి 10 గంటల సమయంలో యజమాని దగ్గర పర్మిషన్ తీసుకుని అతడు భార్యకు చెప్పకుండా ఇంటికి వెళ్లాడు. ఫ్రెండ్ ఉండాల్సిన ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. అంతే డోర్ బెల్ కొట్టాడు. లోపల భర్త స్నేహితుడితో శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయిన భార్యకు దిమ్మతిరిగిపోయింది. భర్త పిలుపులు బయట నుంచి వినిపించడంతో ఏం చేయాలో వాళ్లకు తోచలేదు. తప్పించుకునేందుకు వేరే మార్గం కూడా లేదు. అటువైపు నుంచి భర్త కేకలు.. లోపల ప్రియుడు.. చివరకు ప్రియుడు సాహసం చేసి వాళ్లు ఉంటున్న రెండో అంతస్థు కిటికీ నుంచి దూకేశాడు.

ఆ తర్వాత ఏమి ఎరగనట్లు తలుపు తీసింది.. ఇంతసేపు ఏం చేస్తున్నావ్ అంటూ భర్త ప్రశ్నిస్తే నిద్రపోయానని అబద్ధం చెప్పింది. భర్త ఆమెతో కాసేపు గొడవపడి మళ్లీ రెస్టారెంట్‌ విధులకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అపార్ట్‌మెంట్ యజమాని దగ్గర నుంచి రెస్టారెంట్‌లో ఉన్న భర్తకు ఫోన్ వెళ్లింది. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పింది విని వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశాడు. రెండు కాళ్లు విరిగిపోయి, తీవ్ర రక్తస్రావం అవుతూ చికిత్స తీసుకుంటున్న ఫ్రెండ్ తలదించుకుని కనిపించాడు. ‘మీ ఫ్లాట్ కిటికీ నుంచి దూకేశాడు. కాళ్లు విరిగాయి. మీ భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు’ అని పోలీసులు తను అనుమానపడుతున్న విషయాన్నే చెప్పారు.

అయితే భార్య మాత్రం తామిద్దరం కలవడం ఇదే మొదటిసారి అని పోలీసుల వద్ద వాపోయింది. తనను మోసం చేసినందుకు భార్యపై కేసు పెట్టాడా సిరియన్ భర్త. ఈ యేడాది జనవరి 19న జరిగిన ఈ సంఘటనకు సంబంధించి దుబాయిలోని అల్ రషీదియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనికి సంబంధించిన విచారణ మంగళవారం దుబాయి సెషన్స్ కోర్టులో జరిగింది. తామేమీ తప్పు చేయలేదని భార్య విచారణలో చెప్పగా.. స్నేహితుడు మాత్రం తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. తనను మోసం చేసిన భార్యకు, తన స్నేహితుడికి శిక్ష విధించాలని భర్త న్యాయమూర్తిని వేడుకున్నాడు. న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *