కోచ్ రేసులో ముందున్న ర‌విశాస్ర్తి..!

భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ఎవ‌ర‌న్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. మొత్తం ఆరుగురు ఈ ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. కోచ్ ఎంపిక నిర్ణ‌యాన్ని వాయిదా వేయాల‌ని బీసీసీఐ నిర్ణయించిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ క్రికెట్ స‌ల‌హా సంఘం స‌భ్యుడు గంగూలీ ప్ర‌క‌టించాడు. కోచ్ ప‌ద‌వి కోసం ర‌విశాస్ర్తి, వీరేంద‌ర్‌సెహ్వాగ్‌, టామ్‌మూడీ, రిచ‌ర్డ్ పైబ‌న్‌, లాల్‌చంద్‌రాజ్‌పుత్‌, సిమ‌న్స్ పోటీ ప‌డుతున్నారు. వీరిలో సిమ‌న్స్ మిన‌హా మిగిలిన అంద‌రినీ ఇంట‌ర్వ్యూ చేసిన‌ట్లు గంగూలీ చెప్పాడు. విండీస్ దిగ్గ‌జం సిమ‌న్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఇంట‌ర్వ్యూ చేయ‌లేద‌ని వివ‌రించారు. కోచ్ పేరు నిర్ణ‌యంచే ముందు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా సంప్ర‌దించామ‌ని చెప్పారు. కోచ్ ప‌ద‌వికి ఆరుగురు పోటీ ప‌డుతున్నా ర‌విశాస్ర్తికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *