యాజిలి నుంచి యజ్ఞం మొదలుపెట్టా… జెడి లక్ష్మినారాయణ సంచలన ప్రకటన

సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ సంచలన ప్రకటన చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ పై ఆయన గురువారం నోరు విప్పారు. తన రాజకీయ భవిష్యత్తు… కార్యాచరణపై కొంత స్పష్టత ఇచ్చారు. బుధవారం ఆయన పొలిస్ ఉద్యోగానికి చేసిన రాజీనామా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో గురువారం గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం యాజిలిలో రైతులతో లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. ఆయనకు రైతులు, విద్యార్థులు, యువకులు ఘనస్వాగతం పలికారు. ఆయనమేన్నారంటే “గ్రామాల్లో పని చేస్తా అంటే ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకే రాజీనామా చేసి వచ్చా.

యాజలి నుంచే నా యాగం ప్రారంభిస్తాను. ఇలా ఆరంభించడం చాలా సంతోషంగా ఉంది. అంతా కలిసి పని చేస్తే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. మన ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. అయితే మనం చేపట్టే కార్యక్రమంలో ఏ విధంగా నిలబడనున్నాం.? ఏ విధంగా చేయనున్నాం? అనేది ముఖ్యం” అని అన్నారు.

‘‘నేను వ్యవసాయ మంత్రినైతే మీ కోసం ఏం చేయాలో ఆలోచిస్తా. వ్యవసాయ మంత్రిని కాకుంటే సోషల్‌ వర్కర్‌గా పనిచేస్తా. నేను ఒక్కడిగా ఏం చేయలేను.. సంఘటితంగా ఏదైనా సాధించవచ్చు. రైతుల జీవితాల్లో వెలుగులు పండిచాలన్నదే మా ప్రయత్నం. పవిత్ర గ్రామమైన యాజిలీలో ఈ యజ్ఞానికి పూనుకున్నా. ఈ యజ్ఞాన్ని చెడగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు’’ అని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

తన రాజకేయ ప్రవేశం గురించి వచ్చిన వార్తలపైన ఆయన స్పందించారు. మీడియా తనను చాలా పార్టీలలో చేర్చిందని, తాను అన్ని పార్టీలను ఆప్షన్‌గా ఉంచుకున్నానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఏ పార్టీతో టచ్‌లో లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. అధ్యయనం పూర్తయ్యాక ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. హోదా వల్ల ఏపీకి మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *