జగన్ కు అమిత్ షా ఫోన్… ఎందుకు? ఏమిటి? ఎలా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి మధ్య రహస్య పోత్తు కొనసాగుతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగినట్లే వైసిపి ముఖ్య నేతలు ప్రధాని మంత్రి కార్యాలయంలో తరచు కనిపిస్తూ మరింత అనుమానాలను పెంచుతున్నారు. ఇటీవల కాలంలో జగన్ తో పాటు… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పక్కన చేరారన్న ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే వైసీపీతో రహస్య అవహగహన మాత్రమే కాదని నేరుగా ఆ పార్టీని నియంత్రించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయిడు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌ చేయడంతో.. వైసీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక వాయిదా పడిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నమ్మించి మోసం చేశారని మోదీపై ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. బీజేపీ నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

ఈ నెల 30న తిరుపతిలో జరిగే టీడీపీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ సభకు 1.50 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశం మొత్తం తిరుపతి సభపై చర్చించేలా నిర్వహిస్తామన్నారు. మరోవైపు టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ కూడా జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగల పార్టీ నాయకుడు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ కూడా అయిన పంచమర్తి అనురాధ విమర్శించారు.

.
బీసీలకు వైఎస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. కడపలో బీసీ కాంట్రాక్టర్‌ను హత్య చేసిన చరిత్ర మీదని అనురాధ విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్యను లోబరుచుకుని వైసీపీ మాట్లాడిస్తుందని వైసీపీ ప్లీనరీలో బీసీల ప్రస్తావనే లేదని పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *