బాబుకు ఉరేసినా త‌ప్పులేద‌న్న జ‌గ‌న్‌

నంద్యాల ఉప ఎన్నిక‌లు రాజ‌కీయ కాక‌ను పెంచేశాయి. ముఖ్య‌మంత్రిని న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పులేద‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ కు ఎన్నిక‌ల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది. దానికి వివ‌ర‌ణ ఇచ్చిన రెండు రోజుల‌కే ఆయ‌న మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మోసాలు, అన్యాయాలు చేసే ఇలాంటి వ్య‌క్తికి ఉరిశిక్ష వేసినా త‌ప్పు లేద‌ని అంటూనే ఉంటాం అని అన్నారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన రోడ్‌షోలో జ‌గ‌న్ మాట్లాడారు.

మూడున్న‌రేళ్ల పాల‌న‌లో ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా నెర‌వేర్చ‌లేద‌ని ఆరోపించారు. 2014 ఆగ‌స్టు 15న క‌ర్నూలులో చేసి వాగ్దానాల్లో ఏ ఒక్క‌టి అమ‌లు కాలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రైతులు, మ‌హిళ‌లు, నిరుద్యోగుల‌ను మోసం చేసిన చంద్ర‌బాబుకు ఉరిశిక్ష విధించినా త‌ప్ప‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్లో ఒక్క‌టీ నెర‌వేర్చ‌ని ముఖ్య‌మంత్రిని ఏం చేయాల‌ని ప్ర‌శ్నించారు. డ‌బ్బుంద‌ని, ఎవ‌రినైనా కొనుగోలు చేయవ‌చ్చ‌న్న అహంకారంతో చంద్ర‌బాబుకు క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎమ్మెల్యేల‌ను కొన్న‌ట్లు ఓట‌ర్ల‌ను కొనేందుకు డ‌బ్బు సంచుల‌తో వ‌స్తార‌ని ఆరోపించారు. ఉప ఎన్నిక‌లు రాగానే చంద్ర‌బాబుకు కుట్టుమిష‌న్లు, ట్రాక్ట‌ర్ల పంపిణీ గుర్తుకొచ్చింద‌నీ అన్నారు. న్యాయం-అన్యాయం, ధ‌ర్మ‌-అధ‌ర్మం మ‌ద్య జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో నా్య‌యం వైపు నిల‌బ‌డాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *