ఎన్టీఆర్ ఎలా ఇరగదీసారంటే… సెన్సార్ టాక్ చెప్పిందిదే…!

సరిగ్గా మరో వారం తర్వాత వేడుకలకు సిద్ధం అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇవాళే శుభవార్త అందింది. సినిమా సెన్సార్ పూర్తి కావడంతో సినిమా ఎలా ఉందన్న టాక్ బయటకు వచ్చింది. సినిమాలో మూడు పాత్రల్లో జూనియర్ ఇరగదీసారన్న కామెంట్స్ రావడంతో ఆయన అభిమానులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుందని కల్యాణ్‌రామ్‌ తెలిపారు.

సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్లు కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రావణాసురుడిలా పది తలలతో కనిపించారు. ‘జై లవకుశ’చిత్రాన్ని చూసి సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారని మాటల రచయిత కోనా వెంకట్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పేర్కొన్నారు.

ఇక జై లవ కుశ విదుడలకు ముందే సెన్సార్ దశలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. దుబాయిలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు.. జై లవకుశ సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన సమాచారం మేరకు.. జై లవకుశ మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశారు. ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు ఇప్పుడే చూసిందనీ, సినిమా బాగా వచ్చిందని, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమని సంధు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *