కమల్ కొత్త పార్టీ… 16నే ప్రకటన..!

తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుందా? రజనీకాంత్ కంటే ముందే మరో పెద్ద హీరో కమల్ హాసన్ పార్టీ మొదలు పెట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. తమిళనాడు లో జోరుగా షికారు చేస్తున్న వార్తలను బట్టి పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

కమల్ పార్టీ ప్రకటనకు వేదిక… ముహూర్తం కూడా ఖరారు ఐపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 16న మత చాందస వాదానికి వ్యతిరేకంగా సీపీఎం నిర్వహించనున్న నేషనల్ సెమినార్‌కు తాను కూడా హాజరవుతున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. ఇదే సెమినార్ వేదికగా కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి.

కోజికోడ్‌లో ఠాగూర్ సెంటినరీ హాల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించనున్నారు. ఇటీవలే కేరళ సీఎంతో సమావేశమై తమిళ రాజకీయాలను చర్చించిన కమల్ హాసన్.. తాజాగా సెమినార్‌లో ఆయనతో కలిసి పాల్గొననుండడం విశేషం. ఇటీవల ట్విటర్ ద్వారా కమల్ హాసన్ తరచూ అక్కడి అన్నాడీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే సీపీఎం నిర్వహించే కార్యక్రమంలో ఆ పార్టీ సీఎం సమక్షంలో కొత్త పార్టీ ప్రకటనను కమల్ చేస్తారా అంటే అనుమనమేనన్న వాదనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *