సంచలనం నన్ను రేప్ చేసి చంపేస్తారేమో… కతువా కేసులో 

ముక్కుపచ్చలారని ఓ చిన్న పాపపై జరిగిన పైశాచిక దాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటవుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దోషులని శిక్షించాలని దేశమంతా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ కఠువా బాధిత కుటుంబం తరపున వాదిస్తున్న న్యాయవాది దీపిక రాజావత్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు నిత్యం బెదిరింపులు వస్తున్నాయనీ… తనను కూడా అత్యాచారం చేసి చంపేస్తారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితుల నుంచి తనకు వస్తున్న బెదిరింపులపై సుప్రీంకోర్టుకు విన్నవించాలని నిర్ణయించినట్టు లాయర్ పేర్కొన్నారు. ఇవాళ ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ‘‘నేను ఎప్పటి వరకు బ్రతుకుతానో తెలియదు. నన్ను కూడా అత్యాచారం చేసి చంపేస్తారేమో.. ఏదో విధంగా నష్టపర్చాలని చూస్తున్నారు. ‘‘మేము నిన్ను వదిలిపెట్టబోము..’’ అంటూ నిత్యం బెదిరింపులు వస్తున్నాయి.

 

నేను ప్రమాదంలో ఉన్న సంగతిని సుప్రీంకోర్టుకు చెప్పాలని నిర్ణయించుకున్నాను…’’ అని దీపిక పేర్కొన్నారు. జనవరి 8న కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుల్లో ఓ టీనేజర్ సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *