ఆ క‌మ్మ నేత‌కు కేసీఆర్ వ‌ల‌

తెలంగాణ సీఎం కేసీఆర్ 2019 ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం కోసం పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే విజ‌యం త‌మ‌ద‌న్న ధీమాతో ఉన్న ఆయ‌న బారీ మెజారిటీ సాధించేందుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. గ‌డిచిన మూడేళ్ల‌లో ఇత‌ర పార్టీల్లోని ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్షంచ‌డం ద్వారా ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌రిచారు. టీడీపీని అయితే చావు దెబ్బ‌కొట్టారు. రాజ‌ధానిలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా మిగ‌ల‌కుండా చేశారు. అయినా ప్ర‌తిప‌క్షాలన్నీ ఒక్క‌టై వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కోదండరాం మాట‌ల‌ను బ‌ట్టి ఆయ‌న కూడా ప్ర‌తిప‌క్ష‌ల‌తో క‌లిసిపోయేలా క‌నిపిస్తోంది. అంతేకాదు ప్ర‌తిప‌క్షాల‌న్నీ రెడ్డి సామాజిక‌వ‌ర్గంపై ఫోక‌స్ చేశాయి. ఈ ప‌రిణామాలు ఒక‌ర‌కంగా టీఆర్ ఎస్‌కు ఇబ్బందిక‌రంగా మారాయి. భారీ మెజారిటీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాయి. దాంతో కేసీఆర్ ముంద‌స్తు ప్ర‌ణాళికల‌కు సిద్ధ‌మ‌య్యారు.

తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గాల్లో ఒక‌టైన క‌మ్మ కులంపై కేసిఆర్ ఫోక‌స్ చేశారు. రాష్ర్టంలో 35 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపును నిర్దేశించ‌గ‌లిగిన సామ‌ర్థ్యం ఈ సామాజిక‌వ‌ర్గానికి అందుకే . అందుకే కేసీఆర్ గ‌తంలో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ కి చెందిన మాజీ మంత్రి తుమ్మ‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌ర‌చి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయ‌న‌కు స‌ముచిత గౌర‌వం ఇచ్చారు. మంత్రి ప‌ద‌విలోనూ కూర్చోబెట్టారు. ఇప్పుడు మ‌రో మాజీ మంత్రిపై ఫోక‌స్ చేశారు. టీడీపీ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును కారు ఎక్కించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ప్ర‌స్తుతం మండ‌వ పార్టీ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ఆయ‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. గ‌తంలో ఆయ‌న ప్రాతినిధ్య వ‌హించిన డిచ్‌ప‌ల్లి ప్ర‌స్తుత నిజామాబాద్ రూర‌ల్ స్థానం కేటాయించేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. అది కాకుండా ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ స్థానాలు కేటాయించేందుకూ రెడీగా ఉంది. మ‌రి మండ‌వ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *