కేసీఆర్ చీరల పంపిణీ… కవిత మీద జనాగ్రహం

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ చీరలు పెట్టి ఖుషి చేద్దాం అనుకున్నారు. అయితే కేసీఆర్ లక్ష్యం మంచిదే అయినా చేతికి అందిన చీరలు చూసి జనం రగిలి పోయారు. జగిత్యాలలో అయితే చీరలను రోడ్డు మీద పరిచి రాస్తారోకో చేశారు. ఆ తర్వాత వాటిని తగులబెట్టారు. రంగం లోకి దిగిన పోలీసులు దాన్ని అడ్డుకున్నారు.

ఈ సుదర్భంగానే జనం తమ నిరసనను వెళ్లగక్కారు. కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత గంటకో చీర మారుస్తారని… ఒక్కో చీర 20 వేలకు పైగానే ఉంటుందని… అయితే తమకు మాత్రం 50 రూపాయల చీరలు ఇచ్చారని మహిళలు మండిపడ్డారు. మహిళ ఆగ్రహం ఈ వీడియోలలో చూడండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *