కవితకు కష్టాలు మొదలైనట్లేనా… అందుకే కేటీఆర్…?!

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ… ఎంపీ కవితకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పొలిటికల్ గా తిరుగు లేని కవితకు మున్ముందు రాజకీయ ప్రయాణం నల్లేరు మీద నడక కాదట. అదేంటి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురే లేదని అంతా చెబుతుంటే… ఆయన కూతురుకు కష్టాలు ఏమిటి అంటారా? జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి మరి.

నిజామాబాద్ ఎంపీగా ఉన్న కవితకు ఇప్పటి వరకు తిరుగు లేదు. ఆ నియోజకవర్గంలో కవితతో పోటీ పడగలిగే నేత లేరు. ఇది నిన్నటి వరకు నిజమే. కాని ఇప్పుడు మాత్రం ఆ మాట నిజం కాదు. ఎందుకంటే… నిజామాబాద్ జనంలో మంచి పట్టున్న నేత డి.శ్రీనివాస్. మొన్నటి వరకు కాంగ్రెస్లో చక్రం తిప్పిన డీఎస్ తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు.

తాజాగా డీఎస్ తనయుడు అరవింద్ నేరుగా వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ఈ పరిణామమే ఎదురు లేకుండా సాగిపోతున్న కవిత పొలిటికల్ కెరీర్ కి కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపాలని బీజేపీ భావిస్తోంది. అందుకే కీలక నేతలను పార్టీలో చేర్చుకునే పనిని కమలనాథులు వేగవంతం చేసారు. ఇప్పుడు బీజేపీలు చేరిన డీఎస్ తనయుడు కూడా కవిత నియోజకవర్గంలో బలమైన నేత. ఆయన సామాజికవర్గం ఈ ప్రాంతంలో ఎక్కువగా వుంది. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న అరవింద్ కాషాయ కండువా కప్పుకొన్నారు.

దీనితో సహజంగానే కవితకు దీటైన ప్రత్యర్థి వచేసినట్లే. ఈ పరిణామాన్ని గమనించిన మంత్రి… కవిత అన్నయ్య కేటీఆర్ నియోజకవర్గ జనం కవిత వైపే ఉండేలా కొన్ని పనులు చేయడం మొదలెట్టేసారు. నిజమాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి ప్రకటించారు. దానివల్ల ఇక్కడి యువతను కవిత వైపే ఉంచాలన్నది కేటీఆర్ ఆలోచన. ఈ ప్రాజెక్ట్ ఆచరణలోకి వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగితే కవిత బేఫికర్ వుండొచ్చేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *