కేసీఆర్ను సీఎం అంటే ఒప్పుకోను… సీఎం విధేయుడి వ్యాఖ్యలు

ఆయన కేసీఆర్ కి వీర విధేయుడు. తెలంగాణ ఉద్యమ సమయంలోను… రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ విధేయత విషయంలో ఆయనకు సాటి లేరు. ఆయనే టిఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్. ఆదివారం జగిత్యాలలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సీఎం అంటే తాను అంగీకరించనని చెప్పి సభికులని విస్మయానికి గురి చేశారు. కేసీఆర్ ఎప్పుడూ ఉద్యమ నేతనే అని వినోద్‌ అనడంతో ఒక్కసారిగా వారంతా హర్షద్వానాలు వ్యక్తం చేశారు.

తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ సహించరని, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఉదయం ఓటు వేశామని, సాయంత్రం జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదం ఇచ్చామని ఇదే కేసీఆర్… టిఆర్ఎస్ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. అలాగే తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని అన్నారు.

అలాగే, కేసీఆర్‌ను వెతుక్కుంటూ జయశంకర్ సార్ వచ్చారని, కేసీఆర్ ఎప్పుడూ ఉద్యమ నేతనేనని ఎంపీ అన్నారు. అయితే కేసీఆర్ ని పొగిడే క్రమంలో జయశంకర్ సార్ ని తక్కువ చేసేలా సారె కేసీఆర్ ని వెతుక్కుంటూ వచ్చారనడంపై మాత్రం కొందరు పదవి విరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *