ఆస్ర్టేలియ‌న్ ఓపెన్ విజేత మ‌నోడే

ఆస్ర్టేలియ‌న్ ఓపెన్ బ్యాడ్మింట‌న్‌లో మ‌నోడు స‌త్తాచాటాడు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో తెలుగు క్రీడాకారుడు విజేత‌గా నిలిచాడు. కిదాంబి శ్రీకాంత్ టైటిల్ కైవ‌సం చేసుకున్నాడు. సెమిస్‌లో తిరుగులేని ఆదిప‌త్యంతో విజ‌య గీతిక వినిపించాడు. అదే ఊపుతో ఫైన‌ల్‌లో తిరుగులేని విజ‌యం సాధించాడు. చైనాకు చెందిన ఒలింపిక్ చాంపియ‌న్ చెన్‌లాంగ్‌పై 22-20, 21-16 తేడాతో వ‌రుస గేముల్లో గెలుపొందాడు. తొలిగేములో హోరాహోరీ పోరు జ‌రిగినా చివ‌రికి కిదాంబినే ఆధిప‌త్యం సాధించాడు. రెండోగేములో మొద‌టి నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ ప‌త్ర్య‌ర్థికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. కిదాంబి శ్రీకాంత్ విజ‌యంతో ఆయ‌న స్వ‌స్థ‌లం అయిన గుంటూరులోని చంద్రమౌళిన‌గ‌ర్‌లో పండుగు వాతావ‌ర‌ణం నెల‌కొంది. చెన్‌లాంగ్‌పై శ్రీకాంత్ విజ‌యం సాధించ‌డంపై కుటుంబ‌స‌భ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *