లక్ష్మీస్ ఎన్టీఆర్లో రోజా ఫిక్స్… వైస్రాయి సీన్లు అందులో భాగమే..!

ఎన్టీఆర్ మీద సినిమా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించగానే వివాదం రేగింది. వర్మ ఏమి మాట్లాడినా వివాదమే. అలాంటిది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ మీద సినిమా వర్మ తీస్తున్నాడు అంటే అదెంత హాట్ టాపిక్ అవ్వాలో అంతా అవుతుంది. రాజకీయాలకు అతీతంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి సొంతూరైన చిత్తూరు జిల్లా పలమనేరులో మంగళవారం మధ్యాహ్నం వర్మ విలేకరులతో మాట్లాడారు. నిర్మాత రాకేష్‌ రెడ్డి పలమనేరు నియోజకవర్గ వైసీపీ సయన్వయకర్తల్లో ఒకరు.

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర మహాభారతంలోని 18 పర్వాలు లాంటిదని అందులో ఒక భాగాన్నే చిత్రంగా మలుస్తున్నాన్నన్నారు. మిగిలిన పర్వాలు తాను తీయబోనని మరెవరైనా తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినప్పుడు ఆయన వైసీపీలో ఉన్న సంగతి తనకు తెలియదన్నారు. రాజకీయాలకు అతీతంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టిన నాటి నుంచి ఈ కథ ప్రారంభమవుతుందని, ఆయన మృతి చెందిన సంఘటనతో చిత్రం ముగుస్తుందన్నారు. ఒక భాగంలోనే ఈ సంఘటలన్నీ ప్రేక్షకులకు చూపించనున్నామని వర్మ చెప్పారు.

 

ఇక ఈ సినిమాలో రోజాకు కూడా ఒక పాత్ర ఉండొచ్చని… ఆఫీ లక్ష్మీపార్వతి పాత్రా కాదా అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. వైశ్రాయ్‌ హోటల్‌లో జరిగిన రాజకీయ సంఘటనలను పెద్దగా చూపిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు అన్నీ సమానంగానే ఉంటాయన్నారు. ఈ చిత్రాన్ని 2018 ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేస్తామన్నారు. ఎన్నికలకు దగ్గర్లో విడుదల చేయడంపై ఇది రాజకీయ కుట్రగా పలువురు భావిస్తున్నారన్న ప్రశ్నకు.. సినిమా పూర్తయిన తరువాత దాచిపెట్టుకొని విడుదల చేసే అవకాశం ఉండదని, ఎప్పుడు పూర్తయితే అప్పుడే విడుదల చేస్తామని, ఎన్నికలకూ, సినిమాకూ సంబంధం లేదనీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *