ల‌లిత్‌మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం!

ల‌లిత్ మోదీ క్రికెట్ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్కరికీ ఈ పేరు సుప‌రిచిత‌మే. ఐపీఎల్‌తో ఆయ‌న పెద్ద స్టార్ అయిపోయారు. ఆ ఐపీఎల్ వ్య‌వ‌హారంలోనే వివాదాలు ఆయ‌న‌ను చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆయ‌న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రాజ‌స్తాన్‌లోని నాగౌరీ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలిపారు.
త‌న రాజీనామా లేఖ‌ను బీసీసీఐ ప్ర‌తినిధి రాహుల్ జోహ్రీకి పంపిన‌ట్లు పేర్కొన్నారు. భ‌విష్య‌త్ త‌రాల‌కు అవకాశం ఇచ్చేందుకే తాను త‌ప్పుకుంటున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. ఇన్నాళ్లు త‌న‌కు అండ‌గా ఉన్న‌వాళ్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఐపీఎల్ చైర్మ‌న్‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌న పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కొచ్చి టీమ్‌లో డ‌బ్బు చెల్లించ‌కుండానే వాటాలు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మోడీ ప్ర‌స్తుతం విదేశాల్లో ఉంటున్నారు. నాగౌరీ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ ప‌ద‌వి ఇచ్చినందుకు ఆ రాష్ర్ట క్రికెట్ అసోసియేష‌న్ పై బీసీసీఐ సీరియ‌స్ అయ్యింది. ఆ రాష్ర్టంలో ఐపీఎల్‌, అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌పై నిషేధం విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *