కులాంత‌ర వివాహాన్ని జీర్ణించుకోలేక‌… అమ్మాయి త‌ల్లిదండ్రులు ఏం చేశారంటే…

వాళ్లిద్ద‌రూ డాక్ట‌ర్లు . ఇద్ద‌రివీ వేర్వేరు కులాలు. అయినా వాళ్ల మ‌న‌సులు క‌లిశాయి. పెద్ద‌ల‌ను ఎదింరించి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి యువ‌తి త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. వాళ్లు ఒక ప‌థ‌కం ప‌న్నారు. దానిని అమ‌లు చేశారు…
తిరుప‌తికి చెందిన న‌వీన్‌కుమార్, అత‌ని చెల్లెలు చంద్ర‌గిరి ఏరియా ఆస్ప‌త్రిలో హౌస్ స‌ర్జ‌న్‌గా ప‌ని చేస్తున్నారు. అక్క‌డే హౌస్ స‌ర్జ‌న్‌గా ప‌ని చేస్తున్న సిరిచంద‌న‌తో అత‌నికి ప‌రిచ‌యం అయ్యింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింది. త‌మ ప్రేమ గురించి పెద్ద‌ల‌కు చెప్పారు. వాళ్ల కులాలు వేరు కావ‌డంతో అమ్మాయి త‌ల్లిదండ్రులు రాజ‌భూపాల్‌రెడ్డి, పార్వ‌తమ్మ ఒప్పుకోలేదు. దాంతో వాళ్లిద్ద‌రూ ఆగ‌స్టు 16వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి కుటుంబం నుంచి బెదిరింపులు మొద‌ల‌య్యాయి. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ వెళ్లి ఎస్సీని క‌లిశారు. ఆ త‌ర్వాత అమ్మాయి కుటుంబం సైలెంట్ అయ్యింది. దాంతో వాళ్ల కాపురం సాఫీగా సాగుతోంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం అనుకోని ఘ‌ట‌న జ‌రిగింది.

న‌వీన్‌కుమార్ బైక్‌పై చెల్లెల్ని, భార్య సిరిచంద‌న‌ను ఎక్కించుకొని ఇంటికి బ‌య‌లుదేరాడు. సిరిచంద‌న కుటుంబ‌స‌భ్యులు రెండు కార్ల‌లో వాళ్ల‌ను వెంబ‌డించారు. మ‌ధ్య‌లో బైక్‌ను అట‌కాయించారు. న‌వీన్‌, అత‌ని చెల్లెలిపై దాడి చేశారు. క‌ళ్ల‌లో కారం చ‌ల్లారు. సిరిచంద‌న‌ను తీసుకెళ్లిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన అన్నాచెల్లెళ్ల‌ను స్థానికులు ర‌క్షించారు. అనంత‌రం న‌వీన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. త‌మ‌ను విడ‌దీసేందుకే సిరిచంద‌న‌ను ఆమె త‌ల్లిదండ్రులు తీసుకెళ్లార‌ని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *