అన్నతోనే గర్భం… ఆపై అబార్షన్… పోయిన ప్రాణం

ఐదవ నెలలో గర్భవిచిత్తికి ప్రయత్నించి ఓ యువతి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వైద్యం వికటించడంతో యువతి మరణించింది. ఈ సంఘటనలో డాక్టర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌ వనస్థలిపురంలో జరిగింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక యువతి (19).. వనస్థలిపురంలోని ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ సెకండియర్‌ చదువుతోంది. ఆమెకు సమీప బంధువైన సారంగి మధు అనే యువకుడు సైదాబాద్‌లో ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పరిచయం ప్రేమగా మారి.. యువతి గర్భం దాల్చింది.

ఆ గర్భాన్ని తెసేయించుకోవలని భావించిన వారిద్దరూ కమలానగర్‌లోని అనుష హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాడు. అబార్షన్‌ చేసేందుకు అక్కడి వైద్యురాలు గిరిజారాణి అంగీకరించారు. రూ.20 వేలు ఫీజు తీసుకుని అదే రోజు సాయంత్రం ఆమెకు గర్భస్రావం చేశారు. అయితే ఆదివారం ఉదయం ఆ యువతికి ఒక్కసారిగా బీపీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

మార్గమధ్యంలో పరిస్థితి విషమించగా.. దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలా ఆసుపత్రిలో చేర్చారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయితే, అబార్షన్‌ కారణంగా యువతి ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతుండగా సహాయంగా వచ్చిన యువతి ఆదివారం ఉదయం ఇడ్లీ తినిపించిందని, దాంతో ఇడ్లీముక్కలు శ్వాసనాళంలోకి ప్రవేశించి ఆమె ఊపిరి ఆడక మృతి చెందిందనే కథనం కూడా వినిపిస్తోంది.

పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. యువతికి అబార్షన్ చేయించిన మధు ఆ యువతికి అన్న అవుతాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్‌ గిరిజారాణిని, మధును, ఆస్పత్రిలో యువతికి సహాయంగా ఉన్న మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు.

అనూష ఆస్పత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించగా.. ఇలా చట్టవిరుద్ధంగా అబార్షన్‌ చేసిన కేసులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక మధు మాత్రం.. ఆమె గర్భం దాల్చటానికి తానే కారణమని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది. మృతురాలి గర్భం నుంచి సేకరించిన పిండాన్ని పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *