ప్రియురాలి మృతదేహం దొరికింది… ప్రియుడి మృతదేహం మాత్రం….


వాళ్లిద్దరూ ప్రేమికులు. ఎగువ నుంచి దిగువకు జలువరుతున్న నీటిని చూసి ఆనందించేందుకు మంజీర నది వద్దకు వెళ్లారు. అక్కడే నీటి అందాలను అడమరచి ఆస్వాదిస్తున్న ఆ ప్రేమికులు వున్నట్లుండి నిటిలోకి జరిపోయారు. చుట్టుపక్కలవారు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషాదంలో ప్రేమికులిద్దరు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌ మూసాపేట ప్రాంతానికి చెందిన నసీరుద్దీన్‌(20), బోరబండ ప్రాంతానికి చెందిన శరీన్‌బేగం(18) సింగూరు ప్రాజెక్టును తిలకించేందుకు శనివారం వచ్చారు. అక్కడి కిందకు దిగుతున్న జలాలను చూస్తూ ప్రమాదవశాత్తు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం స్థానిక మత్య్సకారుల సహకారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ చీకటి పడడంతో నిలిపివేశారు. ఇరువురి ఆచూకీ కోసం ఏఎస్ఐ రాములు అధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మత్స్యకారుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు.

శరీన్‌ మృతదేహం ప్రాజెక్టు దిగువ భాగంలోని కొత్త వంతెన కింద ముళ్లచెట్లకు చిక్కుకుని లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి ఏఎస్ఐ రాములు తరలించారు. ఘటనా స్థలం వద్ద శరీన్‌ తల్లిదండ్రులు రోదించారు. చెప్పాపెట్టకుండా వచ్చి మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నసీరుద్దీన్‌ ఆచూకీ కోసం గాలించినప్పటికీ లభించలేదు. నదిలో మొసలి కనిపించడంతో మత్స్యకారులు వెనుతిరిగారు.

నసీరుద్దీన్‌ (20), బోరబండకి చెందిన శరీన్‌బేగం (18) మోటార్‌ బైక్‌పై శనివారం సింగూరు ప్రాజెక్టు చూడ్డానికి వచ్చా రు. సెల్‌ఫోన్లను హ్యాండ్‌బ్యాగులో ఉంచి ప్రాజెక్టు దిగు వ భాగంలో మంజీర నదిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో జారి కొట్టుకుపోయారు. అప్పటికే ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి గేట్ల ద్వారా నీరు దిగువకు ప్రవహిస్తుంది. ఈ ప్రవా హం దాటికి ఇద్దరూ నీటిలో గల్లంతయ్యారు. పర్యాటకు లు వారిని రక్షించే వీలులేకుండా పోయిం ది. దీంతో అక్కడి స్థానికులకు చెప్పడంతో వారు పుల్‌కల్‌ ఎస్‌ఐ సత్యనారాయణకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడ్డున బండరాళ్లపై ఉంచిన హ్యాండ్‌బ్యాగ్‌ను పరిశీలించి, అందులోని సెల్‌ఫోన్ల ఆధారంగా గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *