ఆ ప్రేమికుల్ని మంచానికి కట్టేసి…. కరెంట్ షాకిచ్చి…!

పైసాచికత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. తాము మనుషులం అని మరిచిపోయిన కొన్ని మృగాలు అమలు చేసిన ఆటవిక శిక్షలకు ఓ ప్రేమ జంట బలయింది. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘోరం ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. పరువు కోసం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న ఈ జంటను కర్కశంగా విడదీసి ప్రాణాలు తీసేసారు.

జిర్గా సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి (15), అబ్బాయి (17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించే అవకాశం లేదని భావించిన ప్రేమికులు నెల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. దానితో రగిలిపోయిన వారి కుటుంబ సభ్యులు ప్రేమ జంట కోసం తీవ్రంగా గాలించారు. చివరికి తమ కంట పడిన జంటను ఇంటికి తెచ్చారు.

ఇంటికి తెచ్చిన తర్వాత వారిద్దరినీ చంపేయాలని జిర్గా మత పెద్దలు హుకుం జారీ చేశారు. అంతే ఇరు కుటుంబాల వారు, గ్రామస్థులు చూస్తుండగా ప్రేమికులిద్దరినీ మంచానికి కట్టేశారు. చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం వారికి కరెంట్ షాకిచ్చి తొలి రోజు అమ్మాయిని, మరుసటి రోజు అబ్బాయిని చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *