దుర్గ‌మ్మ స‌న్నిధిలో ప్రేమ పెళ్లి.. తెల్లారే ప‌ట్టాల‌పై శ‌వాలుగా

చ‌దువు మ‌ధ్య‌లోనే ప్రేమ‌… కాలేజీ ఎగ్గొట్టి పెళ్లి… త‌ల్లిదండ్రుల నిరాక‌ర‌ణ‌… చివ‌ర‌కు రైలుప‌ట్టాల‌పై మాంస‌పు ముద్ద‌లుగా. ఇదీ ఇంజ‌నీరింగ్ చ‌వుతున్న ఓ ప్రేమ జంట విషాద గాథ‌. అబ్బాయి ఇంజ‌నీరింగ్ విద్య మూడో సంవ‌త్స‌రం… అమ్మాయి ద్వితీయ సంవ‌త్స‌రం… ఇద్ద‌రిదీ ఒకే కాలేజి. మాట‌లు క‌లిసాయి. మ‌న‌సులు మురిసాయి. జీవితంలో ప్రేమ పెళ్లి కంటే ఏదీ ఎక్క‌వ కాద‌ని నిర్ణ‌యించుకున్నారు. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా కాలేజీ నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. ఆ త‌ర్వాత విష‌యం ఇంటిలో పెద్ద‌ల‌కు చెప్పారు. వారి నుంచి నిరాక‌ర‌ణ‌. దాంతో క‌ల‌త చెందిన ఆ ప్రేమికులు రైలు కింద ప‌డి త‌నువు చాలించారు.

ప్ర‌కాశం జిల్లాలో గురువారం తెల్ల‌వారుజామున వెలుగుచూసిన ఉదంతం ఇది. ఈ జిల్లాలోని వేట‌పాలెం స‌మీపంలో రైలుప‌ట్టాల‌పై చిధ్ర‌మైన స్థితిలో ఓ యువ‌తీ యువ‌కుడి మృత‌దేహాల‌ను పోలీసులు గుర్తించారు. వారిద‌గ్గ‌ర ల‌భ్య‌మైన ఆధారాల‌తో అబ్బాయి పేరు సందీప్‌. అమ్మాయి మౌనిక‌. ఇద్ద‌రూ ఇక్క‌డికి స‌మీపంలోని ఒక ఇంజ‌నీరింగ్ కాలేజీ విద్యార్థులు. ఇదే జిల్లా తిమ్మ‌స‌ముద్రానికి చెందిన సందీప్ ఇంజ‌నీరింగ్ తృతీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. గుంటూరు జిల్లా మోదుకూరుకు చెందిన మౌనిక కూడా అదే కాలేజీలో రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది.

వీరిద్ద‌రూ శ‌నివారమే కాలేజీ నుంచి వెళ్లిపోయారు. అలా వెళ్లిన‌వారు ఇళ్ల‌కు వెళ్ల‌లేదు. బుధ‌వారం (19 సెప్టెంబ‌రు) నాడు విజయవాడ కనకన దుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత తల్లిదండ్రులకు ఫోన్లో తాము పెళ్లి చేసుకున్న విష‌యం చెప్పారు. ఇరువురి పెద్దలూ వారి పెళ్లికి అభ్యంత‌రం తెలిపారు. ఆ త‌ర్వాత బుధ‌వారం రాత్రి సందీప్ తన సోదరునికి ఓ మెసేజ్ పెట్టాడు. తాను చ‌నిపోతున్నాన‌ని త‌ల్లిని బాగా చూసుకోవాల‌ని అందులో కోరాడు. ఆ వెంట‌నే అత‌డు సందీప్‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక‌, ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొన్న మౌనిక తల్లిదండ్రులు కూడా ఆమెను వెదుక్కుంటూ చీరాల వచ్చారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన ఘోరం జ‌రిగిపోయింది. ఇద్ద‌రూ రైలు కింద ప‌డి ఆత్మహ‌త్య చేసుకున్న‌విష‌యం వారికి తెలిసింది. దాంతో ఇద్ద‌రి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *