స్పైడర్ సందడి షురూ…. దుమ్ము రేపుతున్న టీజర్

ప్రిన్స్ పండగ మొదలైంది.మహేశ్ బాబు బర్త్ డే సందర్బంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడర్ టీజర్ వచ్చేసింది.చెప్పిన సమయం కంటె 2 గంటల ముందే ఇంటర్నెట్‌లో ఈ టీజర్ చక్కర్లు కొడుతోంది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ నెట్‌లో ఉదయం ఏడు గంటలకే ఈ టీజర్ హల్‌చల్ చేసింది.

మహేశ్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ చూసి పండగ చేసుకుంటున్నారు. బ్లాక్‌బస్టర్ ఆన్ ది వే అంటూ మురుగదాస్ చెప్పిన మాట నిజం కాబోతోందంటూ టీజర్ చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళ టీజర్ కూడా నెట్‌లో హల్‌‌చల్ చేస్తోంది. దసరా కానుకగా స్పైడర్ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *