తన మగతనం గురించి బయట చెబుతుందేమో అని భార్యని… పెళ్ళైన 4 నెలలకే..!

పెళ్ళైన నాలుగు నెలలకే భార్యను కడతేర్చాడో ప్రభుద్దుడు. ఇందుకు కారణం తాను సెక్సుకు పనికి రానన్న విషయం బయట పెడుతుందేమోనన్న భయమే కారణం. తన చేతగాని తనానికి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడా దుర్మార్గుడు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిందీ దారుణం.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ(నూకనూటిపల్లి) తండాకు చెందిన అంజలీబాయి(19)ని ఇద్దరు బంధువులతో కలిసి భర్త హరినాయక్ చంపేసి, శింగనమల వద్ద పూడ్చినట్లు విచారణలో తేలింది. ఎన్‌ఎన్‌పీ తండాకు చెందిన హరినాయక్.. అదే ఊరి వాసి అంజలీబాయిని ఈ ఏడాది మార్చి 15న ప్రేమ వివాహం చేసుకున్నాడు. శృంగారం పట్ల హరినాయక్ ఆసక్తి చూపేవాడు కాదని తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడేవారు. తన శృంగార బలహీనతను భార్య ఎక్కడ బయటపెడుతుందోనని హరినాయక్ ఆందోళన చెందుతుండేవాడు.

ఆ అనుమానం పెనుబూతమైంది. విచక్షణ మరిచిపోరు. చివరకి ఉన్మాదిగా మారిపోయాడు. భార్యను ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. తన అక్క కుమారుడైన గణేష్ నాయక్ వజ్రకరూరు మండలం నాగులగడ్డం తండాలో ఉంటున్నాడు. హరినాయక్ మిత్రుడు అనిల్‌నాయక్‌తో కలిసి భార్య హత్యకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ప్లాన్ ప్రకారం జులై 11న అంజలీబాయిని హరినాయక్ అక్క ఊరైన శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు తీసుకొచ్చారు.

అంజలి భాయిని మాయ మాటలు చెప్పి శింగనమల చెరువు సమీపంలో ముసలిమడుగు వద్దకు తీసుకెళ్లారు. గణేశ్, అనిల్‌తో కలిసి హరినాయక్.. భార్య అంజలీబాయి గొంతును ఆమె చున్నీతో బిగించి, చంపేశారు. పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టారు. అనంతరం గొయ్యి తవ్వి అక్కడే పాతిపెట్టారు. మరుసటి రోజు 12న హరినాయక్ తన భార్య అంజలీబాయి కనిపించడం లేదంటూ వజ్రకరూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అప్పట్నుంచి భర్త హరినాయక్ రోజూ తన భార్య ఆచూకీ తెలిసిందా అంటూ స్టేషన్ చుట్టూ తిరిగేవాడు. పోలీసులకు అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. అంజలీబాయి శవాన్ని శింగనమల ముసలిమడుగులో పాతిపెట్టారన్న విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ వజ్రకరూరు నుంచి ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ తండా వాసులు దాదాపు 300 మంది తరలివచ్చారు. తమ కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని అంజలీబాయి తల్లిదండ్రులు వజ్రకరూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి, నిరసనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు వారిని శాంతింప చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *