మంచు లక్ష్మి… ఇదేమి అన్యాయం..?

విభిన్న సినిమాలు తీసే మంచు లక్ష్మి కొత్త సినిమా వైఫ్ ఆఫ్ రాము. టైటిల్ ల్లోనే కొత్తదనంతో వస్తున్న ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కినట్లుగా ఆ టీజర్ చూస్తే తెలుస్తుంది. ‘‘వైఫ్ ఆఫ్ రామ్’’ టీజర్‌ని అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి, మంచు లక్ష్మికి, అలాగే చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఇది అన్యాయమండీ.. అంటూ మంచు లక్ష్మి చెబుతున్న ఈ టీజర్ క్షణం తరహాలో ఉంది.


తప్పకుండా మంచు లక్ష్మికి ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెడుతుందని టీజర్ చూసిన వారంతా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌ని మెచ్చకుంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈమంచు లక్ష్మి పాత్ర ఈ సినిమాలో చాలా సహజంగా, అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.


పూర్తి వైవిధ్యంగా మానవ సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాజమౌళి వద్ద ‘ఈగ’, ‘బాహుబలి-1’ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *