బిగ్ బ్రేకింగ్… మక్కా మసీదు కేసు కొట్టేసిన న్యాయమూర్తి రాజీనామా

 

ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న మక్కామసీదు పేలుళ్ల కేసులో సోమవారం తుదితీర్పు వెలువడింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడంలో ప్రాషిక్యూషన్ విఫలమైందని చెబుతూ నాంపల్లిలోని స్పెషల్ ఎన్‌ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేసింది. విచారణ ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఐదుగురు నిందితులనూ నిర్ధోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఆ కేసులో తీర్పు చెప్పిన ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

తీర్పు వెలువరించిన వెంటనే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామా ఆమోదించేవరకు తనకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నప్పటికీ… గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు తెలియవచ్చింది. మక్కా మసీదు పేలుళ్ల కేసుకు సంబంధించి ఏమైనా ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారా? ఇంకేమైనా ఒత్తిడులు ఉన్నాయా?… కొద్ది రోజులుగా తెలంగాణలో పలువురు న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

ముగ్గురు జడ్జిలను ఏసీబీ అధికారులు అరెస్టులుచేసి కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయయూర్తుల లిస్టులో రవీందర్ రెడ్డి కూడా ఉన్నారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. తన రాజీనామాకు సంబంధించి ఇప్పుడేమీ మాట్లాడలేనని, రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను చెప్పదలచుకున్న విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడతానని రవీందర్ రెడ్డి చెప్పారు. ఇవాళ్టి తీర్పు తర్వాత బెదిరింపులు వచ్చినట్లు రవీందర్ రెడ్డి  ఆయన మిత్రులతో చెప్పారని సమాచారం. నిజానికి మరో రెండు నెలల్లో రవీందర్ రెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *