పని రాక్షసుడు చంద్రబాబు… అర్ధరాత్రి 12:30 ఏం చేస్తున్నారో తెలుసా?

రాజకీయంగా ఎవరెన్ని విమర్శలైన చేయొచ్చు కానీ… పని విషయంలో… కష్టపడే విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమను గుర్తించాల్సిందే. నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను… తరచు చంద్రబాబు చెప్పే మాట ఇది. కానీ ఏదో ఆవేశంలో చెప్పేసి వదిలేసే రకం కాదు ఏపీ ముఖ్యమంత్రి. సచివాలయానికె పోనీ ముఖ్యమంత్రిని చూసాం. సచివాలయం తన ఆవాసంగా మార్చుకున్న సీఎం మాత్రం చంద్రబాబే. ఇందుకు తాజాతాజా ఉదహరణప ఫోటో. సహజంగా రోజుకు 18 గంటల పాటు కష్టపడే ఆయన.. తుఫానులు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో నిద్రకూడా పోరు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా అటూ ఇటూ కాస్త కూడా బెసక్కపోవడం.. ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకోవడం ఆయన స్టైల్.. నాలుగేళ్ల క్రితం విశాఖను కుదేపేసిన హుధుద్ బీభత్సం సమయంలోనూ ఏ మాత్రం సంయమనం కోల్పోలేదు. తుఫాను తగ్గిన తర్వాత వ్యానులో కూర్చోనే పరిస్థితిని చక్కదిద్దారు. తాజాగా తిత్లీ తుఫాను ఉత్తరాంధ్రను వణికించింది. దీనిని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.

అనంతపురం జిల్లా పర్యటను ముగించుకుని బుధవారం రాత్రికి అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి.. తిత్లీ ప్రభావం, సహాయకచర్యల గురించి కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ మాత్రం విశ్రమించకుండా రాత్రి 12.30 గంటల వరకు అధికారులను అప్రమత్తం చేస్తూ.. రియల్‌టైమ్ గవర్నెన్స్ సాయంతో మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి చంద్రబాబును పని రాక్షసుడు అనడంలో తప్పు ఏమైనా ఉందా. అసలు ఏడు పడులకు దగ్గర పడుతున్న వయసులో ఇంత కష్టం పడాల్సిన అవసరం ఉందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *