2009లో 500 పెట్టుబడి ఇప్పుడేంతయ్యిందో తెలుసా..

ఎంత అయ్యి ఉంటుంది.. రెండు రూపాయల వడ్డీ లెక్కించినా మహా అయితే 2వేల రూపాయలు అవుతుంది అని టక్కున సమాధానం ఇస్తారు. అంతేనా… 500 రూపాయలు అంటే మధ్య తరగతి కుటుంబం ఒకరోజు ఖర్చు కంటే తక్కువ. కానీ ఆ డబ్బు 9 సంవత్సరాల్లో సృష్టించిన సంపద ఎంతో తెలుసా… అక్షరాలా …. 500 అంత ఎలా అయ్యింది. .. అంటే సమాధానం స్టాక్ మార్కెట్.. బజాజ్ ఫైనాన్స్ షేర్.
2009 మార్చిలో బజాజ్ గ్రూప్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర 4.64 రూపాయలుగా ఉంది. అప్పుడు 500 కేటాయించిన వాళ్లకు 100 షేర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ షేర్ ధర పెరుగుతూ వచ్చింది. 2016 లో 10వేల స్థాయికి చేరింది. ఆ సంవత్సరంలో కంపేనీ ఒక షేర్ కు ఒక షేర్ ను బోనస్ గా ప్రకటించింది. అంతే కాదు 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక షేర్ ను 2 రూపాయల ముఖ విలువ కలిగిన 5 షేర్లు గా విభజించారు. దాంతో 100 షేర్లు 1000 అయ్యాయి. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ షేరు ధర 2688 రూపాయల్లో ఉంది. 1000 షేర్ల విలువ 26లక్షల88వేలుగా ఉంది.
2013 సెప్టెంబర్ 16న బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర 114 రూపాయలుగా ఉంది. అప్పుడు 11400 పెట్టుబడి పెట్టిన వాళ్లకు కూడా 26లక్షల88వేల సంపద సమకూరింది.
డివిడెండే 24300

బజాజ్ ఫైనాన్స్ లో పెట్టిన 500 రూపాయల పెట్టుబడికి ఇప్పటివరకు డివిడెండ్ రూపంలోనే 24300 రూపాయలు వచ్చాయి. రెండేళ్లలోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడికంటే ఎక్కువ మొత్తంలో అంటే 800 డివిడెండ్ రూపంలో వాళ్ల ఖాతాల్లో జమ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *