మోడీ దిగొచ్చారు… జిఎస్టీని కుదించారు… ఎవరికోసమొ తెలుసా…?


ప్రధాని మోడీ తాను అనుకున్నదే చేస్తారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన తనదారిన తాను తాను అనుకున్నది చేసుకుపోతారు. అలాంటి మోడీ హఠాత్తుగా తన నిర్ణయాన్ని సమీక్షించుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ జిఎస్టీ పరిధిని కుదించారు. అయితే ఈ నిర్ణయం వెనుక ప్రజల కష్టాలు… ముఖ్యమంత్రుల వత్తిళ్ళు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ అసలు వాస్తవం వేరే ఉంది.

హఠాత్తుగా… జిఎస్టీ స్లాబులు కుదించడం… బంగారం మీద విధించిన నిబంధనలు సడలించడం… కోటి టర్నోవర్‌ వరకూ కాంపోజిషన్‌ పథకం జీఎస్టీ సరళతరం.. 3 నెలలకు రిటర్న్‌లు… 27 వస్తువులు, 12 సేవల పన్ను రేట్లను తగ్గించడం… రాష్ట్రాల కోసం ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల జీఎస్టీ రేటును 12 నుంచి 5 శాతానికి కుదించడం…. వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటి వెనుకా ఉన్నది ఒకే ఒక కారణంగా తెలుస్తుంది.

దీనంతటికి కారణం గుజరాత్. మోడీ సొంత రాష్ట్రం . అవును ఆ రాష్ట్రం కోసమే ప్రధాని ఇప్పుడీ వెనకడుగు వేశారని తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో గుజరాత్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల గుజరాత్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరిగింది. దాంతో శాసనసభ ఎన్నికల్లో తేడా కొట్టేలానే ఉంది. స్థానిక పరిస్థితులకు తోడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కూడా అక్కడ ప్రతికూలంగా మారాయి. ఇది ఇలాగే కొనసాగి గుజరాత్లో ఓడిపోతే ఇక విపక్షాలకు ఆయుధం దొరికినట్లే.

అందుకే ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని భావించిన మోడీ జిఎస్టీ విషయంలో వేగంగా వెనకడుగు వేశారు. నోట్ల రద్దు విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చిన పట్టించుకోని మోడీ జిఎస్టీ విషయంలో మాత్రం అంతే బెట్టు కొనసాగించలేక పోయారు. దీనికి కారణం గుజరాత్లో ఏమాత్రం రిస్క్ చేయొద్దు అన్న ఉద్దేశమేనని బిజెపి వర్గాలే చెబుతున్నాయి. జిఎస్ట్ వల్ల పెరిగిన ధరలతో జనం ఇబ్బంది పడడం ఒక ఎత్తు అయితే వ్యాపారులు ఆగ్రహం మరో ఎత్తు. ఒకేసారి అందరిని శత్రువులను చేసుకోవడం ఇష్టం లేకనే మోడీ తానే తగ్గరన్న వాదనా ఉంది. నల్లధనం అధికంగా బంగారం రూపంలో పొగుపడుతుందని చెప్పిన పెద్దలే… వాటి కొనుగోళ్లపై తాము పెట్టిన ఆంక్షలను పూర్తిగా ఎత్తేయడం గమనార్హం. ఏదైతేనేమి ప్రజలకు మాత్రం కొద్దిగా ఊరట లభించినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *