అవును… ఆమె వ‌స్తోంది…

ప్ర‌ధాని మోదీ జూన్‌లోఅమెరికా వెళ్లారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న కుటుంబాన్ని క‌లిశారు. ఆ స‌మ‌యంలో ట్రంప్ కుమార్తె ఇవాంకాను భార‌త్‌కు రావాల‌ని ఆహ్వ‌నించారు. ఇక్క‌డ జ‌రిగే ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సుకు భార‌త్ ఆతిథ్యం ఇస్తుంద‌ని , ఆ స‌ద‌స్సుకు రావాల‌ని ఆమెను కోరారు. ఆమె రాక కోసం ఎదురుచూస్తుంటాన‌ని చెప్పారు. అందుకు ఆమె అంగీక‌రించారు. నిజంగానే ఇవాంకా మ‌న దేశానికి వ‌స్తున్నారు. అదీ భాగ్య‌న‌గ‌రానికి. అంతేకాదు మోదీ, ఇవాంకా ఒకే వేదిక‌పై క‌లుసుకోబోతున్నారు.
భార‌త్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా న‌వంబ‌రు 28 నుంచి మూడు రోజుల‌పాటు ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు(జీఈఎస్-2017) నిర్వ‌హించ‌నున్నాయి. ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే భార‌త్ బృందానికి మోదీ, అమెరికా బృందానికి ఇవాంకా నేతృత్వం వ‌హించ‌నున్నారు. రెండు దేశాల్లోని ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఒక చోట చేర్చే ఉద్దేశంతోనే ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు మోదీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఇవాంకా రాక‌కోసం ఎదురు చూస్తున్న‌ట్లు మ‌రో ట్వీట్ చేశారు.

ఈ స‌ద‌స్సుకు హైద‌రాబాద్ వేదిక కావ‌డంతోపాటు మోదీ, ఇవాంకాలు హాజ‌ర‌వుతుండ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స‌ద‌స్సుకు భాగ్య‌న‌గ‌రం ఆతిథ్యం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి తార‌క‌రామారావు ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ ఈ స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను చూస్తోంది. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు న‌గ‌రాల‌ను ప‌రిశీలించారు. న‌వంబ‌రులో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణం బాగుటుంద‌ని నిర్ధారించి ఇక్క‌డ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *